Women Reservation Bill | రాజకీయాలకతీతంగా మహిళా బిల్లుకు మద్దతివ్వండి: బండి సంజయ్
Bandi Sanjay | మహిళల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation bill)కు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కోరారు. చట్టసభల్లో రాజకీయంగా మహిళా రిజర్వేషన్ల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారికి అండగా నిలవాలన్నారు.
త్రినేత్ర.న్యూస్: మహిళల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation bill)కు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కోరారు. చట్టసభల్లో రాజకీయంగా మహిళా రిజర్వేషన్ల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారికి అండగా నిలవాలన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా, మహిళా సాధికారతను కోరుకునే పార్టీలన్నీ పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లును వ్యతిరేకించే, దూరంగా ఉండే పార్టీలకు భవిష్యత్‌లో మహిళలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు దశాబ్దాల నాటి కల అని గుర్తు చేశారు. ఈ బిల్లుతో అతివలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రక అవసరమని వెల్లడించారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ ఈ బిల్లుకు మద్దతు పలకాలని బండి పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. డీలిమిటేషన్‌తో పార్లమెంట్ స్థానాలు పెరగనుండడంతో తెలంగాణ అసెంబ్లీలో 60 మంది మహిళలకు అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహించే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ‘నారీశక్తి వందన్ అధినియం’ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ చట్టాన్ని 2029 లోక్‌సభ ఎన్నికలలోపే అమల్లోకి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వివరించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




