త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ayodhya Ram Mandir | అయోధ్య రాముడికి ‘సూర్య తిల‌కం’.. రామ‌న‌వ‌మి వేళ అరుదైన దృశ్యం

Ayodhya Ram Mandir | ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయం (Ayodhya Ram Mandir)లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీరామనవమి వేడుకల వేళ బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం (Surya Tilak)’ చూసి భక్తులు పరవశించిపోయారు. రాముడి విగ్రహ ప్రతిష్టాప‌న అనంతరం మూడో ఏటా వేడుక‌లు నిర్వ‌హిస్తుండ‌డంతో భ‌క్తులు పోటెత్తారు.

S

News | Published On Mar 27, 2026, 1.31 pm IST

Ayodhya Ram Mandir | అయోధ్య రాముడికి ‘సూర్య తిల‌కం’.. రామ‌న‌వ‌మి వేళ అరుదైన దృశ్యం
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయం (Ayodhya Ram Mandir)లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీరామనవమి (Sri Rama Navami) వేడుకల వేళ బాలరాముడి నుదిటిపై ‘సూర్య తిలకం (Surya Tilak)’ చూసి భక్తులు పరవశించిపోయారు. రాముడి విగ్రహ ప్రతిష్టాప‌న అనంతరం మూడో ఏటా వేడుక‌లు నిర్వ‌హిస్తుండ‌డంతో భ‌క్తులు పోటెత్తారు. దేశవిదేశాల నుంచి భక్తులు త‌ర‌లివ‌చ్చారు.

ఐఐఏ శాస్త్ర‌వేత్త‌లు ఘ‌న‌త‌..

గర్భగుడిలోని బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు ప్ర‌స‌రించేలా మూడో అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ప్ర‌త్యేక‌ వ్యవస్థను ఏర్ప‌టు చేశారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని అమ‌ర్చారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరించి తిలకం వలే కన్పిస్తోంది. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ (CBRI) శాస్త్రవేత్తలు దీన్ని నిర్మించారు.

గేర్ టీత్ మెకానిజం..

ప్రతి శ్రీరామ నవమి రోజున సూర్య తిల‌కం ప‌డేలా గేర్‌ టీత్‌ మెకానిజం (gear teeth mechanism) వినియోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరో పరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ శ్రీరామనవమి రోజున‌ వారు అనుకున్న చోటుకు తీసుకొస్తుండ‌డం విశేషం.

https://x.com/ShriAyodhya_/status/2037427267912262078

Advertisement

తాజావార్తలు

Advertisement