త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | లిక్క‌ర్ కేసులో క‌వితకు స‌మ‌న్లు.. ఆమె ఇంటికి సీబీఐ అధికారులు

మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇంటికి గురువారం సీబీఐ అధికారులు (CBI Officers) చేరుకున్నారు. ఢిల్లీ లిక్క‌ర్ కేసు(liquor case) కు సంబంధించి ఢిల్లీ హైకోర్టు (Delhi Highcourt) జారీ చేసిన స‌మ‌న్ల‌ను ఆమెకు అంద‌జేయ‌డానికి సీబీఐ అధికారులు హైద‌రాబాద్‌(Hyderabad) లోని ఆమె ఇంటికి వ‌చ్చిన‌ట్లు తెలిసింది.

S

News | Published On Mar 12, 2026, 2.45 pm IST

Kalvakuntla Kavitha | లిక్క‌ర్ కేసులో క‌వితకు స‌మ‌న్లు.. ఆమె ఇంటికి సీబీఐ అధికారులు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇంటికి గురువారం సీబీఐ అధికారులు (CBI Officers) చేరుకున్నారు. ఢిల్లీ లిక్క‌ర్ కేసు(liquor case) కు సంబంధించి ఢిల్లీ హైకోర్టు (Delhi Highcourt) జారీ చేసిన స‌మ‌న్ల‌ను ఆమెకు అంద‌జేయ‌డానికి సీబీఐ అధికారులు హైద‌రాబాద్‌(Hyderabad) లోని ఆమె ఇంటికి వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఈ మ‌ద్యం కేసులో సీబీఐ అభియోగాలు నిరాధారంగా ఉన్నాయ‌ని పేర్కొంటూ ఇటీవ‌ల‌ రౌస్‌ అవెన్యూ కోర్టు (Rouse avenue court) తీర్పు వెలువ‌రించిన విష‌యం తెలిసిందే.

రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది. స‌రైన రీతిలో విచార‌ణ జ‌ర‌గ‌లేద‌ని ఆరోపిస్తూ అప్పీల్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో కోర్టు జారీ చేసిన‌ సమన్లు ఇచ్చేందుకు అధికారులు కవిత ఇంటికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. కాగా ఈ లిక్క‌ర్ కేసులో క‌విత‌తో పాటు ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ (Aravind kejriwall), ఆప్ నేత సిసోడియాతో పాటు ప‌లువురిని నిర్దోషులుగా పేర్కొంటూ కింది కోర్టు తీర్పు చెప్పింది. క‌విత ఐదు నెల‌లు, కేజ్రీవాల్ ఐదున్న‌ర నెల‌లు మిగ‌తా వారు సంవ‌త్స‌రాలుగా జైలు శిక్ష అనుభవించారు.

న్యాయం నా వైపుంది.. క‌విత‌

ఈ కేసు విచారణ ఈనెల 16న ఉంద‌నే విషయాన్బీ సీబీఐ అధికారులు త‌న‌కు తెలియ‌జేశార‌ని క‌విత చెప్పారు. ఈ విషయంపై మా లీగల్ టీమ్ (legal team) తో చ‌ర్చిస్తున్నామ‌ని.. సత్యం నా తోడుగా ఉంద‌ని, అధికారులకు సహకరిస్తానని పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆమె ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఈ కేసులో చార్జెస్ ఫ్రేమ్ చేయడానికి రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిస్తూ కేసును కొట్టేసిన విష‌యాన్ని ఆమె గుర్తు చేశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను సైతం విచారించాల‌ని కోర్టు చెప్పిన విష‌యం అందిరికీ తెలిసిందేన‌ని పేర్కొన్నారు.

Advertisement
Advertisement