Vision India Summit | ఎన్నికల్లో బీజేపీ గెలవడానికే ఎస్ఐఆర్: అఖిలేశ్ యాదవ్
Vision India Summit | సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) ఆధ్యర్యంలో హైదరాబాద్ లో జరిగిన విజన్ ఇండియా సమ్మిట్ (Vision India Summit) లో ఆ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి (CM) అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) పాల్గొని ప్రసంగిస్తూ ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) వంటి రాష్ట్రాల్లో ఎన్నికల్లో బీజేపీ (BJP) గెలిచేందుకే ఎస్ఐఆర్ (SIR) ను ప్రవేశపెడుతోందని ఆరోపించారు.
విజన్ ఇండియా సమ్మిట్‌లో ప్రసంగించిన అఖిలేష్
ఏఐ సహకారంతో బీజేపీని ఓడిస్తామని స్పష్టీకరణ
ఎస్ఐఆర్‌తో యూపీలో 3 కోట్ల ఓట్ల తొలగింపునకు కుట్ర అని ధ్వజం
Vision India Summit | ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) వంటి రాష్ట్రాల్లో ఎన్నికల్లో బీజేపీ (BJP) గెలిచేందుకే ఎస్ఐఆర్ (SIR) ను ప్రవేశపెడుతోందని సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) అధ్యక్షుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి (CM) అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఆరోపించారు. ఎన్నికల సంఘం (Election Commission) చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై స్పందిస్తూ... ఉత్తర ప్రదేశ్ లో దాదాపు 25 కోట్ల జనాభా ఉందని ప్రభుత్వం చెబుతోందని, ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ ప్రభుత్వం సుమారు 3 కోట్ల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ ఆధ్యర్యంలో హైదరాబాద్ లో జరిగిన విజన్ ఇండియా సమ్మిట్ (Vision India Summit) లో అఖిలేష్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. పరిపాలనలో సాంకేతికత వినియోగం, భవిష్యత్తులో సాంకేతికత రూపాంతరం వంటి అంశాలపై యువతలో అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ అన్ని ప్రధాన పట్టణాల్లో విజన్ ఇండియా సమ్మిట్ లను నిర్వహిస్తోంది. మొదటి సమ్మిట్ బెంగళూరులో నిర్వహించగా.. రెండో సమ్మిట్ హైదరాబాద్ లో నిర్వహిస్తోంది.
ఎస్ఐఆరే ఎన్ఆర్సీ అని ఆరోపణ
సాంకేతికతను సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్ల అనేక ఓట్లు పోతున్నాయని చెప్పారు. ఇది ఎస్ఐఆర్ కాదని, ఇది జాతీయ పౌరుల నమోదు (ఎన్ఆర్సీ) ప్రక్రియ అని విమర్శించారు. ఎన్ఆర్సీని నేరుగా చేపట్టలేక ప్రభుత్వం ఎస్ఐఆర్ ను వాడుకుంటున్నదని, ఎన్ఆర్సీకి ఎన్ని పత్రాలు అడుగుతారో ఎస్ఐఆర్ కి అన్ని పత్రాలు అడుగుతున్నారని మండిపడ్డారు. బూత్ స్థాయి అధికారులకు కూడా శిక్షణ ఇవ్వలేదని, దీంతో క్షేత్ర స్థాయిలో అనేక సవాళ్లు, సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఓటు హక్కు కల్పించడం ఎన్నికల సంఘం బాధ్యత అని, ఓట్లు తొలగించడం కాదని అన్నారు. తాము ఇండియా కూటమిలోనే కొనసాగుతమని పునరుద్ఘాటించారు.
విభజన రాజకీయాలకు వ్యతిరేకమని స్పష్టీకరణ
ఉత్తర్ ప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని బీజేపీ పార్టీని ఓడిస్తామని అన్నారు. తాము విభజన రాజకీయాలకు వ్యతిరేకమని, దానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా విజన్ ఇండియా ద్వారా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. సానుకూల, అభివృద్ది, ప్రగతిశీల రాజకీయాలే చేస్తామని తెలిపారు. రైతులకు, మౌలిక సదుపాయాల కల్పనకు, పట్టణీకరణ, పట్టణాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ట్రాఫిక్ సమస్య పరిష్కారం, ఆరోగ్య, తదితర రంగాల్లో ఏఐ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. వీటిపై సమ్మిట్ లో నిపుణులు అనేక సలహాలు, సూచనలు ఇచ్చారని వివరించారు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని నేరాలను కట్టడి చేయడానికి ఉపయోగించాలని చెప్పారు. మానవులకు సరైన దృక్పథాన్ని, సానుకూల ఆలోచనలు కలిగించేలా భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఏఐతోనే సైబర్ నేరాలను అరికట్టాలని సూచన
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు జరుగుతున్నాయని, రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతూ పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ ఫ్రాడ్ ద్వారా నేరస్తులు కేవలం సామాన్యుల డబ్బులే దోచుకోవడం లేదని, ఐఏఎస్ అధికారులు, జడ్జీల వంటి ఉన్నత స్థాయిల్లో ఉన్న వారిని కూడా మోసం చేస్తున్నారని వివరంచారు. ఏఐ సహకారంతో సృష్టించిన ఫేక్ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో చెలామణి చేస్తున్నారని అన్నారు. వీటన్నింటినీ ఏఐ టెక్నాలజీని వినియోగించుకొని అరికట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సాంకేతికత వల్ల అందరికీ లాభం జరగాలని ఆకాంక్షించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



