Dhruv Vikram | అనుపమ పరమేశ్వరన్ సినిమా నుంచి తప్పుకున్న ధృవ్ విక్రమ్ – ఛాంబర్‌లో కంప్లైంట్
చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ చిక్కుల్లో పడ్డాడు. ఇటీవలే ఓ హీరోయిన్‌తో బ్రేకప్ కారణంగా వార్తల్లో నిలిచిన ఈ తమిళ హీరోపై ఓ టాలీవుడ్ డైరెక్టర్ ఫిల్మ్ ఛాంబర్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. సినిమా చేస్తానని కమిట్‌మెంట్ ఇచ్చి ఓపెనింగ్ ఈవెంట్ అయిన తర్వాత ధృవ్ విక్రమ్ మోసం చేశాడంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Entertainment | Published On Jul 24, 2026, 5.03 pm IST
Dhruv Vikram | చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ లవ్‌స్టోరీకి మనస్పర్థల కారణంగా ఇటీవలే ఎండ్ కార్డ్ పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఓ హీరోయిన్‌తో గత మూడేళ్లుగా ధృవ్ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. పెళ్లి పీటల వరకు వెళ్లిన వీరి బంధానికి అనుకోకుండా భేదాభిప్రాయాల కారణంగా బ్రేకప్ పడినట్లు సమాచారం. ధృవ్ విక్రమ్‌ను సోషల్ మీడియాలో ఆ హీరోయిన్ అన్‌ఫాలో కూడా చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బ్రేకప్ బాధలో ఉండగానే ఈ తమిళ హీరో చిక్కుల్లో పడ్డాడు. అతడిపై తమిళ ఫిల్మ్ ఛాంబర్‌లో ఓ ప్రొడక్షన్ హౌస్ కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిసింది.
మైత్రీ మూవీ మేకర్స్...
ధృవ్ విక్రమ్ హీరోగా ఇటీవలే టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను అనౌన్స్‌చేసింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కరణ్ దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రకటించారు. ఇది తన నాలుగో సినిమా అంటూ ఈ ఓపెనింగ్ ఈవెంట్‌లో విక్రమ్ తనయుడు చెప్పాడు. అయితే నాలుగో సినిమాను మరో బ్యానర్‌లో చేస్తానని ధృవ్ మాటిచ్చి తప్పాడంటూ అతడిపై ఛాంబర్‌లో కంప్లైంట్ నమోదు అయ్యింది.
టాలీవుడ్ డైరెక్టర్...
ధృవ్ విక్రమ్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా గత ఏడాది గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌ను విక్రమ్ ఇంట్లోనే నిర్వహించారు. ధృవ్ 4 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయదు లోహర్, కేతికా శర్మ హీరోయిన్లుగా నటించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా కోసం ధృవ్ విక్రమ్‌కు కోటి రూపాయల వరకు మేకర్స్ అడ్వాన్స్‌గా కూడా ఇచ్చినట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం కూడా భారీగానే ఖర్చు చేసినట్లు తెలిసింది.
రమేష్ వర్మతో కాకుండా...
షూటింగ్ మొదలుపెట్టేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమవుతోన్న తరుణంలో ధృవ్ విక్రమ్ వారికి పెద్ద షాకిచ్చాడు. నాలుగో మూవీని రమేష్ వర్మతో కాకుండా మైత్రీ మూవీ మేకర్స్‌లో చేయబోతున్నట్లు ప్రకటించాడు. తమతో సినిమా కోసం ఇచ్చిన డేట్స్‌ను మరో బ్యానర్‌కు కేటాయించడంపై ఇటీవలే దర్శకుడు రమేష్ వర్మతో పాటు నిర్మాతలు ధృవ్‌ను కలిసినట్లు తెలిసింది. కానీ అతడు సరైన విధంగా రెస్పాండ్ కాలేదని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో చేస్తోన్న సినిమా పూర్తయిన తర్వాతే రమేష్ వర్మ మూవీ చేస్తానని నిర్లక్ష్యంగా బదులిచ్చినట్లు మేకర్స్ ఆరోపిస్తున్నట్లు తెలిసింది.
కోట్ల నష్టం...
ధృవ్ వల్ల తమకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటూ రమేష్ వర్మతో పాటు అతడి సినిమా నిర్మాతలు చెన్నై ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ తమిళ హీరో కంప్లైంట్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. గతంలో ధృవ్ విక్రమ్ కొందరు నిర్మాతలను ఇలాగే మోసం చేశాడంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. వారి ఫిర్యాదును స్వీకరించిన తమిళ ఫిల్మ్ ఛాంబర్ ధృవ్ విక్రమ్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు టాక్. భారీగానే నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆదేశించినట్లు చెబుతోన్నారు. రమేష్ వర్మ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ నటిస్తుండటం వల్లనే ధృవ్ ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Shivani Rajashekar | స్టార్ హీరో కొడుకుతో రాజశేఖర్ కూతురు రొమాన్స్ – నాలుగేళ్ల తర్వాత కోలీవుడ్‌లో ఛాన్స్
జులై 25, 2026

Tamannaah | హీరోయిన్లను గ్లామర్ డాల్స్‌లా చూస్తారు – సౌత్ ఇండస్ట్రీపై తమన్నా కామెంట్లు
జులై 25, 2026

Naga Durga | ఓటీటీలోకి నాగదుర్గ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ – ప్రియురాలి కోసం అప్పులపాలైన ప్రేమికుడి కథ
జులై 24, 2026
తాజావార్తలు
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!



