త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

పెద్దపల్లికి సెమీకండక్టర్ పరిశ్రమ ఇవ్వండి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్ద‌ప‌ల్లి జిల్లాలో సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ కోరారు

a

News | Published On Dec 10, 2025, 3.24 pm IST

పెద్దపల్లికి సెమీకండక్టర్ పరిశ్రమ ఇవ్వండి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
Advertisement

పెద్దపల్లికి సెమీకండక్టర్ పరిశ్రమ ఇవ్వండి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
trinethra.news: పెద్ద‌ప‌ల్లి జిల్లాలో సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ బుధ‌వారం (2025 డిసెంబ‌రు 10న‌) లోక్‌స‌భ‌లో కోరారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. " పెద్దపల్లి ఒక అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్. పెద్ద‌ప‌ల్లి జిల్లాలో అత్యంత ప్రతిభావంతమైన, టెక్నికల్‌గా స్కిల్డ్ యూత్ ఉన్నారు. కానీ నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. పెద్దపల్లిలో సెమీకండక్టర్ ఫెసిలిటీ వస్తే, వేలాది యువతకు ఉద్యోగాలు కలుగుతాయి. రాష్ట్రానికి, దేశానికి కూడా భారీగా మేలు జరుగుతుంది అంతేకాకుండా, ఇటీవల వేరే రాష్ట్రానికి ఇచ్చినట్లు గా సెమీకండక్టర్ ప్రాజెక్ట్ పెద్దపల్లికి కూడా రావాల్సినదేనని ఎంపీ గారు గుర్తు చేశారు. పరిశ్రమలకు కావాల్సిన భూమి, నీటి వనరులు, విద్యుత్, లాజిస్టిక్స్ అన్నీ పెద్దపల్లిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పెద్దపల్లిని సెమీకండక్టర్ హబ్‌గా అభివృద్ధి చేయాలని కేంద్ర పరిశ్రమల శాఖ చర్యలు తీసుకోవాలి” అని వంశీకృష్ణ డిమాండ్ చేశారు

Advertisement

తాజావార్తలు

Advertisement