త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singareni | సింగ‌రేణిలో ప్ర‌మాదం.. జీడీకే 11 బొగ్గు గ‌నిలో కూలిన సైడ్ రూఫ్ ఫాల్

G

Telangana | Published On Feb 25, 2026, 11.02 am IST

Singareni | సింగ‌రేణిలో ప్ర‌మాదం.. జీడీకే 11 బొగ్గు గ‌నిలో కూలిన సైడ్ రూఫ్ ఫాల్
Advertisement

Singareni | త్రినేత్ర‌.న్యూస్‌: పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండంలోని సింగ‌రేణి (Singareni) జీడీకే 11వ బొగ్గు గ‌నిలో ప్ర‌మాదం జ‌రిగింది. దీంతో కోల్ క‌ట్ట‌ర్ ఐల‌య్య తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. బుధ‌వారం ఉద‌యం జీడీకే 11వ బొగ్గు గ‌నిలో సైడ్ రూఫ్ ఫాల్ కూలిపోయింది. దీంతో బొగ్గు పెల్లలు ఐల‌య్య‌ మీద పడటంతో అత‌ని న‌డుము, కాలికి గాయాల‌య్యాయి. వెంట‌నే గోదావ‌రిఖ‌నిలోని సింగ‌రేణి ద‌వాఖాన‌కు త‌ర‌లించామ‌ని అధికారులు తెలిపారు. అక్క‌డ చికిత్స అనంత‌రం, మెరుగైన వైద్యం కోసం హైద‌రాబాద్‌కు త‌రలించామ‌ని చెప్పారు.

సింగ‌రేణి బొగ్గు గ‌నిలో త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రుగుతూనే ఉంటాయి. గ‌తంలో జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలోని కేటీకే 5 ఇంక్లైన్ రెండో లెవెల్ వద్ద వెల్డింగ్ చేస్తున్న క్రమంలో నిప్పు అంటుకుని విషవాయువులు వెలువడ్డాయి. దీంతో అన్వేశ్, ప్రదీప్ అనే ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితులను చికిత్స నిమిత్తం సింగరేణి ఏరియా ద‌వాఖాన‌కు తరలించారు.

అంత‌కుముందు మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలోని కేకే 5 గనిలో సెకండ్ షిఫ్ట్‌లో సైడ్ రూఫ్ ఫాల్ కూలిపోయింది. దీంతో బొగ్గుపెల్లలు మీద పడి రాచ‌ప‌ల్లి శ్రవణ్ కుమార్ (32) అనే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement
Advertisement