త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Gaddam Vamshikrishna | బీజేపీ నిర్లక్ష్యం.. రామ‌గుండం ఆర్‌ఎఫ్‌సీఎల్ కు న‌ష్టం..

Peddapalli \ పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్ రామగుండం (RFCL Ramagundam) సంస్థపై నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీకృష్ణ (MP Vamshikrishna) అన్నారు. సరైన నిర్వహణ లేకుండా నడుపుతున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

S

Flash news | Published On Mar 10, 2026, 6.07 pm IST

MP Gaddam Vamshikrishna | బీజేపీ నిర్లక్ష్యం.. రామ‌గుండం ఆర్‌ఎఫ్‌సీఎల్ కు న‌ష్టం..
Advertisement

- పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

త్రినేత్ర‌.న్యూస్‌: పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్ రామగుండం (RFCL Ramagundam) సంస్థపై నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీకృష్ణ (MP Vamshikrishna) అన్నారు. సరైన నిర్వహణ లేకుండా నడుపుతున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థలో జరుగుతున్న మిస్ మేనేజ్మెంట్, నిర్లక్ష్యంపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు (JP Nadda) పలుమార్లు లేఖలు రాసినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా కూడా కలిసి సమస్యలను వివరించినప్పటికీ సరైన స్పందన లేద‌ని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీఎల్ రామగుండం సంస్థలో ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగించుకోవడం లేదని, సుమారు 70 శాతమే ప్రొడక్షన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యం ఢిల్లీ(Delhi)లో ఉండటం వల్ల ఇక్కడి సమస్యలపై తగిన శ్రద్ధ కొర‌వ‌డింద‌ని చెప్పారు. కార్యాల‌యాన్ని హైదరాబాద్‌ (Hyderabad)కు మార్చాలని పలుమార్లు లేఖలు, విజ్ఞప్తులు చేసినట్లు చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించలేదని వివ‌రించారు. ఈ నిర్ణయం వల్ల సంస్థ నిర్వహణపై మరింత ప్రభావం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

స్థానిక యువ‌త‌కు ఉపాధి...

గతంలో మూతపడిన ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థను తిరిగి ప్రారంభించేందుకు మాజీ కేంద్ర మంత్రి జి. వెంకటస్వామి, కాకా కలిసి అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తో చర్చలు జరిపి కృషి చేశారని గుర్తు చేశారు. అనంతరం వివేక్ ఎంపీగా (Vivek) ఉన్న సమయంలో కూడా సంస్థను మళ్లీ ప్రొడక్షన్‌లోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ సంస్థ ద్వారా అనేక మంది స్థానిక యువతకు ఉపాధి (Employment) లభించిందని చెప్పారు.

Advertisement
Advertisement