త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Exports | ప‌శ్చిమాసియాలో సంక్షోభం.. చ‌మురు ఎగుమ‌తుల‌పై ర‌ష్యా నిషేధం..!

Exports | ప‌శ్చిమాసియాలో కొన‌సాగుతున్న సంఘ‌ర్ష‌ణ, రాజ‌కీయ అస్థిర‌త నేప‌థ్యంలో ర‌ష్యా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏప్రిల్ ఒక‌టి నుంచి పెట్రోల్ ఎగుమ‌తుల‌పై నిషేధం ప్ర‌క‌టించింది. రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

P

News | Published On Mar 29, 2026, 4.49 pm IST

Exports | ప‌శ్చిమాసియాలో సంక్షోభం.. చ‌మురు ఎగుమ‌తుల‌పై ర‌ష్యా నిషేధం..!
Advertisement

Exports | ప‌శ్చిమాసియాలో కొన‌సాగుతున్న సంఘ‌ర్ష‌ణ, రాజ‌కీయ అస్థిర‌త నేప‌థ్యంలో ర‌ష్యా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏప్రిల్ ఒక‌టి నుంచి పెట్రోల్ ఎగుమ‌తుల‌పై నిషేధం ప్ర‌క‌టించింది. రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, దేశీయ ఇంధన ధరలను అదుపులో ఉంచడమే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రాధాన్యత అని నోవాక్ తెలిపారు. రష్యా ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రస్తుత దేశంలోని రిఫైనింగ్ స్థాయిలు స్థిరంగా ఉన్నాయి. స‌రిప‌డిన ఇంధ‌న నిల్వ‌లు అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు, దేశంలో ఇంధన కొరత ఏదీ లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఆయా మంత్రిత్వ‌శాఖ‌ల స‌మీక్ష‌లో మాట్లాడుతూ పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంఘర్షణ ప్రపంచవ్యాప్త సరఫరా, ధరలపై ప్రభావం చూపినప్పటికీ రాబోయే రెండు నెలలకు సరిపడా ముడి చమురు, ఇంధన నిల్వలు భార‌త్ వద్ద తగినంతగా ఉన్నాయని తెలిపారు.

రష్యా ప్రభుత్వం దేశీయ ధరలను నియంత్రించేందుకు ఎగుమతులపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. అయితే, పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో భార‌త్‌లో కొరత ఏర్పడుతుందనే భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో దేశంలో ఇంధన కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ‌శాఖ స్ప‌ష్టం చేసింది. భార‌తీయ రిఫైన‌రీలు వంద‌శాతం కంటే ఎక్కువ సామ‌ర్థ్యంతో ప‌ని చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి 20శాతం పెరిగింది. అంతర్జాతీయ సంక్షోభం ఉన్నప్పటికీ భారత మార్కెట్లో సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా, ధరల స్థిరంగా ఉండేలా చూడటమే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement