త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Robot | హైద‌రాబాద్‌లో ఆ ప‌ని..ఇక రోబోలు చేస్తాయి

వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలవకుండా ఉండేందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల‌ని చర్చించారు. ఇటీవల వర్షాకాలంలో మలక్‌పేట వంటి వాటర్ లాగింగ్ (నీరు నిలిచే) పాయింట్ల వద్ద చేపట్టిన 'రోబోటిక్ క్లీనింగ్ (robotic cleaning)' మంచి ఫలితాలను ఇచ్చింది.

a

News | Published On Dec 18, 2025, 9.47 pm IST

Robot | హైద‌రాబాద్‌లో ఆ ప‌ని..ఇక రోబోలు చేస్తాయి

సంక్షిప్త సారాంశం

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు, వర్షాకాలపు సవాళ్లు, ప్రజా భద్రతను మెరుగుపరచే లక్ష్యంతో జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీస్ కమిషనరేట్లతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర ట్రాఫిక్‌కు సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Advertisement

త్రినేత్ర‌ : హైద‌రాబాద్ న‌గ‌ర ట్రాఫిక్ (traffic) క్రమబద్ధీకరణ, వర్షాకాలపు సవాళ్లు మరియు ప్రజా భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో జీహెచ్ఎంసీ (GHMC), జ‌ల‌మండ‌లి (water board), హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ క‌మిష‌న‌రేట్లు, హైడ్రా, విద్యుత్ శాఖల స‌మ‌న్వ‌య స‌మావేశం (Convergence Meeting) జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అనేక కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. 2025 డిసెంబ‌రు 18న‌, గురువారం జ‌రిగిన క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో జ‌రిగిన ఈ స‌మావేశం వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఆ సుల‌భ్ కాంప్లెక్సుల‌ను తొల‌గిస్తారు

సిటీ రోడ్ల‌పై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న బస్ స్టాప్‌లను రోడ్డు వెడల్పు ఎక్కువగా ఉన్న చోటికి మార్చాల‌ని నిర్ణ‌యించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న సుల‌భ్‌ కాంప్లెక్సులను (sulabh complex) తొలగిస్తారు. పాద చారులు నేరుగా రోడ్లపై నుండి దాటడం వల్ల ట్రాఫిక్ వేగం తగ్గుతున్న‌ద‌ని.. కాబ‌ట్టి పాదచారులు రోడ్డు దాటేందుకు వీలుగా మ‌రిన్ని ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిల‌ను నిర్మించేందుకు ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేయాల‌ని తీర్మానించారు. ప్ర‌ధాన జంక్ష‌న్ల‌లో కేవ‌లం రోడ్ల ప‌రిస్థితి బాగా లేకుండా ఉండ‌డం వ‌ల్ల విప‌రీత‌మైన ట్రాఫిక్ జంక్ష‌న్ అవుతున్న విష‌యం ఈ స‌మావేశంలో ప‌రిశీల‌న‌కు వ‌చ్చింది. అటువంటి చోట్ల వెంట‌నే రోడ్ల మ‌ర‌మ్మ‌తులు, జంక్ష‌న్ ఇంప్రూవ్ మెంట్ ప‌నులు వేగవంతం చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇక రోబోల‌తో ప‌నులు

వర్షాకాల సవాళ్లు - వాటర్ లాగింగ్: వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలవకుండా ఉండేందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల‌ని చర్చించారు. ఇటీవల వర్షాకాలంలో మలక్‌పేట వంటి వాటర్ లాగింగ్ (నీరు నిలిచే) పాయింట్ల వద్ద చేపట్టిన 'రోబోటిక్ క్లీనింగ్ (robotic cleaning)' మంచి ఫలితాలను ఇచ్చింది. ఇదే విధానాన్ని నగరం అంతటా అమలు చేయ‌నున్నారు. పురానాపూల్, బహదూరాపురా, ఎం.జె. మార్కెట్, మాసాబ్ ట్యాంక్, బేగంపేట వంటి ప్రదేశాలలో రోడ్డు మధ్యలో రేలింగ్ లేకపోవడం వల్ల పాదచారులు, వాహనదారులు విచ్చలవిడిగా రోడ్డు దాటుతున్నారు. ప్రమాదాలను నివారించడానికి మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఈ ప్రాంతాల్లో రేలింగ్ ఏర్పాటు చేయ‌నున్నారు. ఉస్మానియా ఆసుపత్రి తో పాటు నగరంలోని ఇతర స్థలాలలో ఆటోలను విచ్చలవిడిగా పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక స్థలాలను ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్ట‌నున్నారు.

త్వ‌ర‌లో.. మ‌ల్టీలెవ‌ల్ పార్కింగ్ యాప్

న‌గ‌ర‌వాసులకు మౌలిక సౌక‌ర్యాల విష‌యంలో ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా వాటర్ బోర్డు, విద్యుత్ మరియు ఇతర స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. క్షేత్ర స్థాయి అధికారులకు అధికారాలను, బడ్జెట్‌ను బదిలీ చేస్తామని, దీనివల్ల క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం అవుతాయని చ‌ర్చించారు. ప్రతి నెలా క్షేత్రస్థాయి సందర్శనల ద్వారా 80% సమస్యలను పరిష్కరించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమస్యలను స్వల్పకాలిక (15 రోజులు), మధ్యకాలిక (1-3 నెలలు), దీర్ఘకాలిక (3 నెలల పైబడి) అని వర్గీకరించి పరిష్కరించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. న‌గ‌రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, పార్కింగ్ సౌకర్యాలను మెరుగుపరచడానికి "మల్టీ లెవల్ పార్కింగ్ యాప్" (Multi-level Parking App) ను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాయని వెల్లడించారు. ఈ యాప్ ద్వారా వాహనదారులు తమకు సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించే అవకాశం కలుగుతుంది.

ఈ స‌మ‌న్వ‌య స‌మావేశంలో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఆర్వీక‌ర్ణ‌న్‌, జ‌ల‌మండ‌లి ఎం.డి. అశోక్ రెడ్డి, హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్‌, హైడ్రా క‌మిష‌న‌ర్ ఎ.వి. రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్, సైబ‌రాబాద్ జాయింట్ సీపీ గ‌జ‌రావు భూపాల్ పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement