త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Saggam Anantha Laxmi Kumar | వాటర్ ట్యాంకర్లతో వంద కోట్ల స్కామ్: రోజుకు 50 వేల సంపాదన.. ఏసీబీ వలలో జలమండలి రెడ్ హిల్స్ జీఎం ఆస్తుల చిట్టా

అనధికారికంగా వాటర్ ట్యాంకర్లు అమ్ముతూ రోజుకు రూ.50 వేలు సంపాదించిన హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ (HMWSSB) జీఎం ఇండ్లపై ఏసీబీ దాడులు. వంద కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!

J

Hyderabad | Published On May 19, 2026, 8.02 pm IST

Saggam Anantha Laxmi Kumar | వాటర్ ట్యాంకర్లతో వంద కోట్ల స్కామ్: రోజుకు 50 వేల సంపాదన.. ఏసీబీ వలలో జలమండలి రెడ్ హిల్స్ జీఎం ఆస్తుల చిట్టా
Advertisement
  • అనధికారికంగా ట్యాంకర్లు
  • రోజుకు 50 వేలు సంపాదన
  • 25 ఏండ్ల సర్వీస్
  • రెడ్ హిల్స్ జనరల్ మేనేజర్ సగ్గం అనంత లక్ష్మీ కుమార్ అక్రమాస్తుల గుట్టు రట్టు

Saggam Anantha Laxmi Kumar | త్రినేత్ర.న్యూస్ : నీళ్లు అమ్ముకుని ఏకంగా వంద కోట్లు కూడబెట్టాడో ప్రభుత్వ అధికారి! అనధికారికంగా వాటర్ ట్యాంకర్లను (Water Tankers) బ్లాక్‌లో అమ్ముకుంటూ రోజుకు వేల రూపాయలు అక్రమంగా సంపాదించిన హైదరాబాద్ జలమండలి (HMWSSB) జనరల్ మేనేజర్‌ బాగోతాన్ని ఏసీబీ (ACB) అధికారులు రట్టు చేశారు. రెడ్ హిల్స్ పరిధిలో జీఎంగా పనిచేస్తున్న ఎస్.ఏ.ఎల్ కుమార్ (Saggam Anantha Laxmi Kumar) నివాసంతో పాటు 8 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించి భారీగా అక్రమాస్తులను గుర్తించారు.

ట్యాంకర్లతో రోజూ రూ.50 వేల సంపాదన

ప్రాజెక్ట్ డివిజన్-VIII, రెడ్ హిల్స్ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సగ్గం అనంత లక్ష్మీ కుమార్ అలియాస్ S.A.L కుమార్.. గత 25 ఏళ్లుగా డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. ఏసీబీ వర్గాల ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆయన చాలా వరకు వాటర్ ట్యాంకర్లను అన్‌అఫీషియల్‌గా (Unofficially) బుక్ చేసి, అపార్ట్‌మెంట్‌లకు ఒక్కో ట్యాంకర్‌కు ఏకంగా రూ. 5,000 వరకు వసూలు చేసేవారు. ఈ దందా ద్వారానే రోజుకు కనీసం రూ. 50,000 వరకు అక్రమంగా సంపాదించినట్లు అధికారులు గుర్తించారు.

ఏసీబీ సోదాల్లో దొరికిందిదే..

ఆదాయానికి మించి ఆస్తులు (Disproportionate assets) ఉన్నాయన్న పక్కా సమాచారంతో.. మల్లాపూర్, సికింద్రాబాద్‌లోని కుమార్ నివాసాలతో పాటు హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో రైడ్స్ నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు, ఆభరణాలు బయటపడ్డాయి. అధికారులు సీజ్ చేసిన వాటిలో రూ.1.05 కోట్ల క్యాష్, భారీగా బంగారం, వెండి ఆభరణాలు, కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఉన్నాయి.

వంద కోట్ల ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే?

లంచాల ద్వారా కుమార్ దాదాపు రూ.100 కోట్ల మేర ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీలో (Gated community) మూడు ఫ్లాట్లు, నగర శివార్లలో ఆరు ఓపెన్ ప్లాట్లు, అలాగే నిజామాబాద్‌లో సుమారు మూడు ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇంకా కొనసాగుతున్న రైడ్స్

ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు తెలిపారు. ఈ దర్యాప్తులో భాగంగా త్వరలో బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేయనున్నారు. అవసరమైతే కుమార్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు విస్తరించే అవకాశం ఉంది. ఈ రైడ్స్ పూర్తయితే సీజ్ చేసిన ఆస్తుల పూర్తి విలువపై అధికారిక ప్రకటన వెలువడనుంది. జలమండలిలో ఒక జీఎం స్థాయిలో ఇంత భారీ అవినీతి జరగడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

Advertisement
Advertisement