త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI GOVERNOR | మీ ఆర్థిక విధానాలు భేష్‌: సీఎం రేవంత్‌కు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కితాబు

ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ఆర్థిక విధానాలు బాగున్నాయంటూ ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ సంజ‌య్ మ‌ల్హోత్రా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు

a

News | Published On Dec 18, 2025, 8.27 pm IST

RBI GOVERNOR | మీ ఆర్థిక విధానాలు భేష్‌: సీఎం రేవంత్‌కు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కితాబు
Advertisement

 

త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ఆర్థిక విధానాలు బాగున్నాయంటూ ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ సంజ‌య్ మ‌ల్హోత్రా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు.RBI బోర్డ్ మీటింగ్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని గురువారం (2025 డిసెంబ‌రు 18న‌) సంజ‌య్ మ‌ల్హోత్రా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను RBI గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటు చేస్తున్నామ‌ని, సోలార్ విద్యుత్ వినియోగం పెంచే దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. BUDS యాక్ట్ ను నోటిఫై చేయాలని ఈ సంద‌ర్భంగా ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ముఖ్య‌మంత్రి రేవంత్‌ను కోరారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ ఫేజ్ (ULI) విషయం RBI తీసుకుంటున్న చొరవను సంజ‌య్ వివ‌రించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, RBI హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్ చిన్మోయ్ కుమార్, జనరల్ మేనేజర్స్ మేజర్ యశ్పాల్ చరణ్, S పాణిగ్రాహి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement