CM Revanth | పాలమూరు రంగారెడ్డి కట్టొద్దన్న హర్షవర్ధన్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది కేసీఆర్ కాదా: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ చావును తానెప్పుడూ కోరుకోలేదని ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు CM Revanth Reddy చెప్పారు.
పాలమూరు రంగారెడ్డి కట్టొద్దన్న హర్షవర్ధన్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది కేసీఆర్ కాదా: సీఎం రేవంత్ రెడ్డి
త్రినేత్ర.న్యూస్ : తెలంగాణకు సాగునీటి కేటాయింపుల్లో ద్రోహం చేసింది ముమ్మాటికీ కేసీయారేనని సీఎం రేవంత్ రెడ్డి మరోమారు ఆరోపించారు. తెలంగాణ భవన్ లో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ విలేకరుల సమావేశం అనంతరం సీఎం ప్రెస్ ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చావును తానెప్పుడూ కోరుకోలేదని ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పారు. సాగునీటి రంగానికి కేసీఆర్ చేసినంత ద్రోహం మరే నాయకుడూ చేయలేదని తెలిపారు. చంద్రబాబునాయుడికి అసలైన శిష్యుడు కేసీయారేనని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టొద్దని కోర్టులో కేసు వేసిన హర్షవర్ధన్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది కేసీయారేనని ఆరోపించారు. పదేళ్లలో కృష్ణా నది మీద ఒక్క ప్రాజెక్టు కూడా బీఆర్ ఎస్ కట్టలేదన్నారు. సాగునీటి విషయంలో ముఖాముఖి చర్చలకు రమ్మంటే ఆయనే ముఖం చాటేస్తున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు. 811 tmc లలో 512 tmc లు ఏపీకి ఇవ్వాలంటూ తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ డిక్లరేషన్ ఇచ్చి తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశాడని ఆరోపించారు. పట్టిసీమను అభినందించింది కేసీయారేనని చెప్పారు. కేవలం కొడుకు-అల్లుడు కొట్టుకుంటున్నారనే కేసీఆర్ బయటికి వచ్చారని ఎద్దేవా చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

BRS Constituency Incharges | 119 నియోజకవర్గాల ఇంచార్జీలు వీరే.. ప్రకటించిన గులాబీ అధినేత కేసీఆర్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



