త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mysaa Postponed | రష్మిక మందన్న “మైసా” వాయిదా….సెన్సార్ రూల్స్ కార‌ణ‌మా?

రిలీజ్ ముంగిట ర‌ష్మిక మంద‌న్న మైసా మూవీ వాయిదాప‌డింది. పోస్ట్‌పోన్‌పై మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ఓ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేశారు. క్వాలిటీ విష‌యంలో రాజీ ప‌డ‌కూడ‌ద‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. మైసా పోస్ట్‌పోన్‌కు సెన్సార్ అడ్డంకులే కార‌ణ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Nov 22, 2026, 4.58 pm IST

Mysaa Postponed | రష్మిక మందన్న “మైసా” వాయిదా….సెన్సార్ రూల్స్ కార‌ణ‌మా?
Advertisement

Mysaa Postponed | రిలీజ్ ముంగిట ఫ్యాన్స్ కు మైసా మూవీ టీమ్ పెద్ద షాకిచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మైసా సినిమాను నవంబర్ 27 న రిలీజ్ చేయబోతున్నట్లు మొద‌ట‌ మేకర్స్ ప్రకటించారు. ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో చివరి నిమిషంలో రిలీజ్ పై యూ టర్న్ తీసుకున్నారు. మైసాను వాయిదా వేస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటన ను విడుదల చేశారు.

నో కాంప్ర‌మైజ్‌....

ఆడియన్స్ కు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియ‌న్స్‌ ఇవ్వాల‌ని అనుకున్నాం. క్వాలిటీ విషయంలో రాజీపడకూడదని ఈ సినిమాను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని మూవీ టీమ్ వెల్ల‌డించింది. మైసా రిలీజ్ కోసం ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదని...త్వరలోనే కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని చెప్పారు.

సీబీఎఫ్‌సీ రూల్స్‌...

మైసా వాయిదాకు సెన్సార్ అడ్డంకులు కారణమని ప్రచారం జరుగుతుంది. సీబీఎఫ్‌సీ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం విడుదల తేదీకి కనీసం రెండు వారాల ముందే ఫైనల్ కాపీని సెన్సార్ బోర్డుకు సమర్పించాలి. పోస్ట్ ప్రొడక్షన్ పనుల డిలే వల్ల మైసా ఫైనల్ ప్రింట్ సిద్ధం కాలేద‌ని, అందుకే సెన్సార్ కార్యక్రమాలకు అడ్డంకులు ఏర్పడ్డాయని అంటున్నారు. అందువ‌ల్లే మైసా వాయిదా వేయాల్సివ‌చ్చింద‌ని చెబుతున్నారు. మైసాలో యాక్ష‌న్‌, ర‌క్త‌పాతంతో కూడిన స‌న్నివేశాలు ఎక్కువే ఉన్నాయ‌ని, ఆ సీన్ల విష‌యంలో సెన్సార్ స‌భ్యులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశార‌ని, రివిజ‌న్ క‌మిటీకి సినిమాను పంపించిన‌ట్లు రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఈ సెన్సార్ అడ్డంకుల‌పై మాత్రం మేక‌ర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు.

ర‌వీంద్ర పుల్లే....

మైసా సినిమాకు రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. రావు రమేష్, గురు సోమసుందరం, ఈశ్వరీ రావు, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో గోండు జాతి యువ‌తిగా నేష‌న‌ల్ క్ర‌ష్ క‌నిపించ‌బోతుంది. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ రోల్‌లో ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోన్న ఫ‌స్ట్ మూవీ ఇది. ఐదు భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

 

Advertisement
Advertisement