Rashmika Mandanna | రికార్డ్ ధరకు రష్మిక మందన్న మైసా ఓటీటీ డీల్ – టాలీవుడ్‌లోనే టాప్
ది గర్ల్‌ఫ్రెండ్ బ్లాక్‌బస్టర్ తర్వాత తెలుగులో మైసా పేరుతో మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది రష్మిక మందన్న. ఔట్ అండ్ యాక్షన్ కథాంశంతో రష్మిక చేస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. కాగా షూటింగ్ పూర్తికాకముందే మైసా మూవీ ఓటీటీ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం.
Rashmika Mandanna | సాధారణంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్ల క్రేజ్, ఇమేజ్ తగ్గుతాయి. కానీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న స్టార్‌డమ్ మాత్రం పెళ్లి తర్వాత రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం పలు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ తెలుగుతో పాటు బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉంది రష్మిక మందన్న.
లేడీ ఓరియెంటెడ్ మూవీ...
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో లేడీ ఓరియెంటెడ్ జానర్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. గత ఏడాది రిలీజైన ఈ సినిమా కమర్షియల్ హిట్‌గా నిలవడమే కాకుండా పలు అవార్డులను అందుకుంది. ఈ సినిమాకుగాను బెస్ట్ హీరోయిన్‌గా తెలంగాణ ప్రభుత్వం నుంచి గద్దర్ అవార్డు రష్మికను వరించింది. ది గర్ల్‌ఫ్రెండ్ తర్వాత తెలుగులో మైసా పేరుతో మరో ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేస్తోంది రష్మిక.
గోండు యువతిగా...
కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ రోల్‌లో రష్మిక నటిస్తున్న ఈ సినిమాకు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గోండు తెగకు చెందిన యువతిగా రష్మిక కనిపించబోతుంది. తన జాతి అస్తిత్వం కోసం ఓ యువతి సాగించిన అసమాన పోరాటం నేపథ్యంలో హై ఇంటెన్స్ యాక్షన్ మూవీగా మైసా తెరకెక్కుతోంది.
ఓటీటీ డీల్ క్లోజ్...
కాగా షూటింగ్ కంప్లీట్ కాకముందే మైసా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఓటీటీ రైట్స్ విషయంలో గతంలో తెలుగులో వచ్చిన ఫిమేల్ సెంట్రిక్ సినిమాలన్నింటిని దాటేసిన మైసా టాప్ ప్లేస్‌లో నిలిచినట్లు చెబుతున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన పుష్ప 2, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాల ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. వ్యూస్ పరంగా ఈ రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డులను తిరగరాశాయి. మరోవైపు రష్మికకు పాన్ ఇండియన్ లెవెల్‌లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొనే నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు మైసా ఓటీటీ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం.
పోస్టర్ రిలీజ్...
కాగా రష్మిక మందన్న బర్త్‌డే సందర్భంగా ఆదివారం స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ముఖం నిండా రక్తం మరకలతో డీ గ్లామర్ లుక్‌లో రష్మిక మందన్న కనిపిస్తోంది. ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రాబోతున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
తెలుగులో మైసాతో పాటు భర్త విజయ్ దేవరకొండతో రణబాలి సినిమా చేస్తోంది రష్మిక మందన్న. బాలీవుడ్‌లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన కాక్ టెయిల్ 2 రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



