Ramayana | రాముడిగా రణభీర్ విశ్వరూపం… రామాయణ టీజర్ అదుర్స్ – హాలీవుడ్‌కు ధీటుగా వీఎఫ్ఎక్స్
హనుమాన్ జయంటి సందర్భంగా గురువారం రామాయణ మూవీ నుంచి రణభీర్‌కపూర్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో శ్రీరాముడిగా రణభీర్ కపూర్ లుక్‌తో పాటు విజువల్స్, వీఎఫ్ఎక్స్, బీజీఎమ్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
Ramayana | రామాయణ మూవీ నుంచి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మేకర్స్. హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం రణభీర్‌కపూర్ ఫస్ట్‌లుక్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో రాముడిగా రణభీర్ లుక్, యాక్టింగ్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. గ్లింప్స్‌లోని విజువల్స్, వీఎఫ్ఎక్స్ హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉన్నాయి.
మర్యాద పురుషోత్తముడిగా...
గ్లింప్స్‌లో తొలి భాగంలో మర్యాద పురుషోత్తముడిగా రాముడి సద్గుణాలను చూపించారు. అధర్మ వల్ల లోకం అస్తవ్యస్తమైనప్పుడు....దానిని సరిచేయడానికి ఎల్లప్పుడూ శ్రీరాముడే వస్తాడు అంటూ క్యాప్షన్ కనిపించగానే గ్లింప్స్‌లో శ్రీరాముడిగా రణభీర్ కపూర్ ఎంట్రీ ఇచ్చేసీన్ బాగుంది. మన రక్షకుడు...మన నాయకుడు...పురాణ పురుషుడు...రాముడు అంటూ చూపించారు. తాను తీసుకున్న నిర్ణయాల ద్వారా నిర్వచించబడిన వీరుడు ....కోరికల కన్నా కర్తవ్యానికే ప్రాధాన్యతనిచ్చే యోధుడు.... సరైంది అయినప్పుడు అధికారాన్ని వదులుకునే నాయకుడు.... సర్వస్వం కోల్పోవాల్సి వచ్చినా...తన లక్ష్యాన్నీ వీడనివాడు...మానవాళికి గత ఐదు వందల ఏళ్లుగా ఆదర్శంగా నిలుస్తున్న ఒకే ఒక కథానాయకుడు శ్రీరాముడు అంటూ విజువల్స్‌తో రాముడిని చూపించిన తీరు గూస్ బంప్స్‌ను కలిగిస్తోంది.
రెండు నిమిషాల నిడివిలో...
రెండో భాగంలో వీరుడిగా శ్రీరాముడి ధైర్యసాహసాలను, తెగువను చూపించారు. ధర్మానికి కట్టుబడి రావణాసురుడిని రాముడు ఎలా ఎదురించాడన్నది చూపించారు.
రణభీర్ విశ్వరూపం...
రెండు నిమిషాల 28 సెకండ్ల నిడివితో కూడిన ఈ గ్లింప్స్‌లో శ్రీరాముడి జీవితాన్ని సంపూర్ణంగా చూపించారు. అయోధ్యలో అతడి సాదర స్వాగతం లభించడం, శివధనుస్సు విరవడం, తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి వనవాసానికి వెళ్లడం... రావణుడితో రాముడు సాగించిన యుద్ధాన్ని ఇందులో కేవలం బీజీఎమ్‌తోనే ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది. రాముడి పాత్రలో రణభీర్‌కపూర్ విశ్వరూపం అద్భుతమంటూ నెటిజన్లు చెబుతోన్నారు. విజువల్స్, బీజీఎమ్ టాచ్ నాచ్‌లో ఉన్నాయని అంటున్నారు.

సాయిపల్లవి...
రామాయణ మూవీలో సీతగా సాయిపల్లవి కనిపించబోతున్నది. రావణాసురుడిగా యశ్ నటిస్తున్నాడు. వీరిద్దరి పాత్రలను గ్లింప్స్‌లో చూపించలేదు. లక్షణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు.
నాలుగు వేల కోట్ల బడ్జెట్...
దాదాపు నాలుగు వేల కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రామాయణ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న డీఎన్ఈజీ సంస్థ ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ సమకూర్చుతుంది. ఏఆర్ రెహమాన్‌తో కలిసి హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ బాలీవుడ్ మూవీకి హీరో యశ్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
రామాయణ పార్ట్ వన్ ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా...సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది రిలీజ్ అవుతోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



