CM Revanth Reddy | కేసీఆర్, హరీశ్ ను జైల్లో పెట్టి సూచనలు చేయండి: సీఎం రేవంత్
Assembly Sessions | కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్‌రావును జైల్లో పెట్టిన తరువాత బీజేపీ నేతలు సూచనలు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శాసనసభ(Assembly) లో ఆదివారం ఆయన మాట్లాడారు. కాళేశ్వరం కేసు(Kaleshwaram case) ను సీబీఐ(CBI) కి అప్పగిస్తే కేసీఆర్, హరీశ్ రావును 48 గంటల్లో జైల్లో పెడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారని.. వాళ్ల మాటలు నమ్మి సీబీఐకి అప్పగించామని వెల్లడించారు.
త్రినేత్ర.న్యూస్: కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్‌రావును జైల్లో పెట్టిన తరువాత బీజేపీ నేతలు సూచనలు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శాసనసభ(Assembly) లో ఆదివారం ఆయన మాట్లాడారు. కాళేశ్వరం కేసు(Kaleshwaram case) ను సీబీఐ(CBI) కి అప్పగిస్తే కేసీఆర్, హరీశ్ రావును 48 గంటల్లో జైల్లో పెడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారని.. వాళ్ల మాటలు నమ్మి సీబీఐకి అప్పగించామని వెల్లడించారు. 48 గంటలు అటుంచితే ఇప్పటికి ఎన్ని నెలలు గడిచిందో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని అన్నారు.
ఢిల్లీలో తొక్కిపెట్టారు..
తాము మొదటి నుంచి అవకతవకలు జరిగాయని మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోవలేదన్నారు. కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని సాక్షాత్తు దేశ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి కూడా చెప్పారన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పంచుకున్నారని ఆరోపించారు.
హౌస్ కమిటీ వేయడానికి ఒప్పుకోవాలి...
హరీశ్ రావు తమ్ముడు మహేశ్ రావు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో ప్రైవేటు పరిశ్రమ యజమానులను బెదిరించారని విమర్శించారు. అంతటితో ఆగకుండా ధరణి ద్వారా వందల ఎకరాల భూ బదలాయింపు చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హరీశ్‌రావు ఒప్పుకుంటే దీనిపై హౌస్ కమిటీ వేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఒకవేళ హరీశ్ రావు నిజాయితీపరుడే అయితే హౌస్ కమిటీ వేయడానికి కేటీఆర్, వెంకటరమణా రెడ్డి ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



