త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Predatory Teacher | సీఎం నియోజ‌క‌వ‌ర్గంలో కీచ‌క టీచ‌ర్‌.. విద్యార్థినితో వెకిలి చేష్ట‌లు

Predatory Teacher | విద్యాశాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కీచక టీచర్ (Predatory Teacher) ఆగ‌డాలు వెలుగుచూశాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినితో వెకిలి చేష్ట‌లకు (Indecent behavior) పాల్ప‌డ్డాడు. ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌కుండా ఉండేందుకు ఎంఈవో, పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడు వ‌త్తాసు ప‌లికిన‌ట్లు తెలుస్తోంది.

S

News | Published On Mar 26, 2026, 12.56 pm IST

Predatory Teacher | సీఎం నియోజ‌క‌వ‌ర్గంలో కీచ‌క టీచ‌ర్‌.. విద్యార్థినితో వెకిలి చేష్ట‌లు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: విద్యాశాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కీచక టీచర్ (Predatory Teacher) ఆగ‌డాలు వెలుగుచూశాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినితో వెకిలి చేష్ట‌లకు (Indecent behavior) పాల్ప‌డ్డాడు. ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌కుండా ఉండేందుకు ఎంఈవో, పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడు వ‌త్తాసు ప‌లికిన‌ట్లు తెలుస్తోంది.

కొడంగల్ (Kodangal) నియోజకవర్గం మద్దూరు మండలం మోమినపూర్ (Mominapur) గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో స్వామి అనే ఉపాధ్యాయుడు విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ నెల 7వ తేదీన కంప్యూటర్ ల్యాబ్‌కు పిలిపించుకుని ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం. కాగా సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. విషయం బయటికి రాకుండా ఉండేందుకు ప్రయత్నించిన ఎంఈవో, ప్రధానోపాధ్యాయుడు, గ్రామ పెద్దలు ఆ ప్ర‌బుద్ధిడికే వ‌త్తాసు ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం.

కాగా ప‌లువురు గ్రామ‌స్థులు అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌పై ఆరా తీసేందుకు రాగా త‌ల‌కు హెల్మెట్ ధ‌రించి పారిపోయాడు. ఆగండి స్వామి సార్‌.. మీతో కొంచెం మాట్లాడాలి అని పిలుస్తున్న‌ప్ప‌టికీ ఆగ‌కుండా గేటు తీసుకొని బ‌య‌ట‌కు పారిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

https://x.com/TeluguScribe/status/2037052364054815155

 

Advertisement

తాజావార్తలు

Advertisement