త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Panchayat Elections | ముగిసిన పోలింగ్‌…

Panchayat Elections | తెలంగాణ (Telangana) పంచాయితీ ఎన్నిక‌ల్లో (Panchayat Elections) చివ‌రిదైన మూడో ద‌శ పోలింగ్ పూర్త‌యింది. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల త‌రువాత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

A

News | Published On Dec 17, 2025, 1.48 pm IST

Panchayat Elections | ముగిసిన పోలింగ్‌…
Advertisement

Panchayat Elections | తెలంగాణ (Telangana) పంచాయితీ ఎన్నిక‌ల్లో (Panchayat Elections) కీలక ఘ‌ట్టం ముగిసింది. చివ‌రిదైన మూడో ద‌శ పోలింగ్ పూర్త‌యింది. మూడో ద‌శ‌లో మొత్తం 3,752 స‌ర్పంచ్ స్థానాల్లో 12,652 మంది ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. 28,410 వార్డుల‌లో 75,725 మంది అభ్య‌ర్థులు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. ఓట‌రు మ‌హాశ‌యుడు వారంద‌రి భ‌విష్య‌త్తును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశాడు. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల త‌రువాత ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అధికారులు ఆ వెంట‌నే ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌క‌టిస్తారు. అనంత‌రం వార్డు స‌భ్యులుగా ఎన్నికైన వారు ఉప‌స‌ర్పంచ్‌ను ఎన్నుకుంటారు. దీంతో దాదాపు నెల‌రోజులుగా సాగుతున్న ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు తెర‌ప‌డ‌నుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement