త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bike stunts & Arrest | బైక్ స్టంట్స్ చేస్తున్న వాళ్ల‌ను లోపలేసేశారు

Bike stunts & Arrest | బహిరంగ రహదారులపై బైక్ స్టంట్లు, ప్రమాదకర డ్రైవింగ్‌, మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నఆరుగురు నిందితులను రాజేంద్రనగర్ జోన్ టాస్క్ ఫోర్స్, అత్తాపూర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.

S

News | Published On May 9, 2026, 11.31 am IST

Bike stunts & Arrest | బైక్ స్టంట్స్ చేస్తున్న వాళ్ల‌ను లోపలేసేశారు
Advertisement

Bike stunts & Arrest | త్రినేత్ర‌.న్యూస్‌: బహిరంగ రహదారులపై బైక్ స్టంట్లు, ప్రమాదకర డ్రైవింగ్‌, మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నఆరుగురు నిందితులను రాజేంద్రనగర్ జోన్ టాస్క్ ఫోర్స్, అత్తాపూర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. 6 మొబైల్ ఫోన్లు, మైస్ట్రో డీలక్స్ స్కూటీ (TS 12 EC 0002), డియో స్కూటీ (TS 12 EL 0755) (మొత్తం విలువ సుమారు రూ. 1,50,000)ని స్వాధీనం చేసుకున్నారు.

ఆరుగురి అరెస్టు..

గత కొంతకాలంగా అత్తాపూర్ నుండి ఆరాంఘర్ మధ్య ప్రధాన రహదారులపై కొందరు యువకులు ద్విచక్ర వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు (స్టంట్లు) చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. వీరు కేవలం తమ ప్రాణాలనే కాకుండా, పాదచారుల, ఇతర వాహనదారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, జిగ్-జాగ్ డ్రైవింగ్, వీలీలు వంటి స్టంట్లు చేస్తూ వాహనాల నుండి నిప్పురవ్వలు వచ్చేలా రాపిడి చేస్తూ వీరంగం సృష్టిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

గ‌తంలో పోక్సో కేసు..

హసన్ నగర్ కు చెందిన సయ్యద్ షాహెద్ (19), షేక్ నసీర్ హుస్సేన్ (19), షేక్ జునైద్ (18), కాలాపత్తర్ కు చెందిన‌ మొహమ్మద్ బిన్ ఇసా (17), అబ్దుల్ సమద్ (20), ఎన్.టి.ఆర్ నగర్ కు చెందిన‌ మొహమ్మద్ అర్బాజ్ హుస్సేన్ ఖాన్ (22)ను పోలీసులు అరెస్టు చేశారు. అర్బాజ్ హుస్సేన్ ఖాన్ పై గ‌తంలో అత్తాపూర్ పోలీస్‌స్టేష‌న్లో పోక్సో కేసు న‌మోదై ఉంది. షాహెద్‌, షేక్ నసీర్ హుస్సేన్, షేక్ జునైద్, మొహమ్మద్ బిన్ ఇసా పై ఇదివ‌ర‌కే రాష్ డ్రైవింగ్ కేసులు న‌మోదై ఉన్నాయి.

పోలీసులు మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలను నిశితంగా గమనిస్తూ ఉండాలన్నారు. చట్టవిరుద్ధమైన, ప్రాణాపాయం కలిగించే ఇటువంటి పనులకు దూరంగా ఉండేలా కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. రహదారులపై ఎక్కడైనా ప్రమాదకర డ్రైవింగ్ లేదా బైక్ స్టంట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఆపరేషన్ నిర్వహించిన టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్, అత్తాపూర్ పోలీసు బృందాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

 

ట్యాగ్స్:

Advertisement
Advertisement