త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

మెస్సి- గోట్ ఫుట్ బాల్ మ్యాచ్ కి పాస్ లేకుంటే నో ఎంట్రీ

ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ GOAT ఫుట్‌బాల్ మ్యాచ్‌కు భారీ భద్రత. టికెట్ లేకుండా రావొద్దని రాచకొండ పోలీసుల కఠిన హెచ్చరిక. మెస్సీ మ్యాచ్‌కు టికెట్ ఉన్నవారికే ప్రవేశం. భారీ రద్దీని నివారించేందుకు ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు చర్యలు ప్రారంభించారు.

a

News | Published On Dec 10, 2025, 3.03 pm IST

మెస్సి- గోట్ ఫుట్ బాల్ మ్యాచ్ కి పాస్ లేకుంటే నో ఎంట్రీ
Advertisement

Messi Match in Hyderabad: No Entry Without Valid Ticket, Warns Rachakonda Police

శనివారం తెలంగాణ సీఎం – మెస్సితో జరగబోయే మెస్సి- గోట్ ఫుట్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద రద్దీ ఏర్పడ కుండా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. టికెట్, పాసులు ఉన్న వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, వారికి మాత్రమే అనుమతి ఉంటుందని మిగతా వారికి ఎట్టి పరిస్థితి లో అనుమతి ఉండదని సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు. ఈ నెల 13న జరుగుతున్న ఈ మ్యాచ్ కు అత్యంత కట్టుదిట్టమైన, భారీ బందో బస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. అభిమానులు సహకరించాలని ఆయన కోరారు.

పోలీసులు మ్యాచ్‌కు వచ్చే అభిమానులకు సూచిస్తూ— నిర్ణీత రూట్లు అనుసరించాలని, ముందుగానే స్టేడియానికి చేరుకోవాలని, భద్రతా సూచనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. రద్దీ పెరిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని స్టేడియం చుట్టుపక్కల భారీగా సిబ్బందిని నియమిస్తున్నారు.  ఈ మ్యాచుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. స్టేడియం లోపల–బయట కఠిన నిఘా, ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్స్, క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్లాన్లు అమల్లోకి వస్తున్నాయి.

అనవసర గుంపులు, టికెట్ లేకుండా వచ్చేవారు, అనధికార ప్రవేశ ప్రయత్నాలు—all will be stopped at outer checkpoints. భద్రతా దృక్పథంలో పోలీసులు “జీరో టాలరెన్స్” విధానాన్ని అనుసరిస్తారు.

Advertisement

తాజావార్తలు

Advertisement