ఓట్ చోర్..గద్దీ ఛోడ్: మోదీకి రాహుల్ సూచన
Special Intensive Revision (SIR- ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ) పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం ..ప్రతిపక్షాలకు మద్దతునిచ్చే ఓటర్లనే జాబితాల నుంచి తొలగిస్తున్నదని లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
ఓట్ చోర్..గద్దీ ఛోడ్: మోదీకి రాహుల్ సూచన
త్రినేత్ర.న్యూస్: Special Intensive Revision (SIR- ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ) పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం ..ప్రతిపక్షాలకు మద్దతునిచ్చే ఓటర్లనే జాబితాల నుంచి తొలగిస్తున్నదని లోక్‌సభ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. SIR పేరుతో జరుగుతున్న ఓట్ చోరీ జరుగుతున్నదంటూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం (2025 డిసెంబర్ 14) ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఓట్ చోర్ గద్దీ చోడ్ నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ, జనరల్ సెక్రెటరీలు జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సంఘం బీజేపీ తొత్తు
ర్యాలీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. బీజేపీ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార బలంతో మోదీ SIR పేరుతో ఎన్డీఏకు లబ్ధి చేకూరేలా ఓట్లు తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సంఘం..బీజేపీపార్టీకి తొత్తులా మారిందని విమర్శించారు. SIRలో అక్రమాలకు తెరలేపిన ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం ప్రమాదం లో పడే అవకాశముందని ఆయన హెచ్చరించారు. దేశవ్యాప్తంగా SIRకు వ్యతిరేకంగా 5 కోట్లకు పైగా సంతకాలు సేకరించామని రాహుల్ చెప్పారు. ఓట్ చోర్ గద్దీ ఛోడ్ అని ఈ సందర్భంగా హెచ్చరించారు SIRకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి అందరూ కలిసి రావాలని ఆయన కోరారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






