త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

పంచాయ‌తీలు..53 శాతం కాంగ్రెస్‌.. 27 శాతం బీఆర్ఎస్

ఆదివారం(2025 డిసెంబ‌రు 14) అర్ధ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు వెలువ‌డిన ఫ‌లితాల ప్ర‌కారం కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుదారులు 2243 స్థానాల్లో గెలుపొందారు. ప్ర‌తిప‌క్ష పార్టీ బీఆర్ ఎస్ మ‌ద్ద‌తు దారులు 1187 చోట్ల విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేశారు. బీజేపీ 269 చోట్ల‌, ఇత‌రులు 624 చోట్ల స‌ర్పంచులుగా ఎన్నిక‌య్యారు.

a

News | Published On Dec 15, 2025, 1.07 am IST

పంచాయ‌తీలు..53 శాతం కాంగ్రెస్‌.. 27 శాతం బీఆర్ఎస్
Advertisement

పంచాయ‌తీలు..53 శాతం కాంగ్రెస్‌.. 27 శాతం బీఆర్ఎస్
త్రినేత్ర‌.న్యూస్ : రెండో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ అధికార పార్టీ కాంగ్రెస్ మ‌ద్ద‌తుదారులే ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు. తొలి విడ‌త‌లో 2344 స్థానాలు కైవ‌సం చేసుకున్న ఆ పార్టీ రెండో విడ‌త‌లోనూ దూసుకెళ్తున్న‌ది. ఆదివారం(2025 డిసెంబ‌రు 14) అర్ధ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు వెలువ‌డిన ఫ‌లితాల ప్ర‌కారం కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుదారులు 2243 స్థానాల్లో గెలుపొందారు. ప్ర‌తిప‌క్ష పార్టీ బీఆర్ ఎస్ మ‌ద్ద‌తు దారులు 1187 చోట్ల విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేశారు. బీజేపీ 269 చోట్ల‌, ఇత‌రులు 624 చోట్ల స‌ర్పంచులుగా ఎన్నిక‌య్యారు.

రెండో విడ‌త‌లోనూ ..తొలి విడ‌త ఫ‌లితాలే

ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి అటు ప్ర‌తిప‌క్ష బీఆర్ ఎస్‌కు తొలి విడ‌త‌లో ద‌క్కిన‌న్ని సీట్లే కొంచెం అటు ఇటుగా రెండో విడ‌త‌లోనూ ద‌క్క‌డం గ‌మ‌నార్హం. రెండు విడ‌త‌లు క‌లుపుకుంటే కాంగ్రెస్ 4577 చోట్ల విజ‌యం సాధించింది. 53.41 శాతం స‌ర్పంచు ప‌ద‌వులు ద‌క్కించుకున్న‌ది. బీఆర్ ఎస్ 2356 చోట్ల గెలిచి 27.49 శాతం గ్రామాల్లో అధికారం నిల‌బెట్టుకున్న‌ది. ఇక బీజేపీ విష‌యానికొస్తే రెండు విడ‌త‌లు క‌లిపి ఆ పార్టీ కేవ‌లం 457 చోట్ల గెలుపొందింది. ఇది కేవ‌లం 5.3 % తో స‌మానం. ఇత‌రులు 1162 చోట్ల గెలిచారు.

పార్టీ             తొలి విడ‌త‌లో       రెండో విడ‌త‌లో            రెండు విడ‌త‌లు క‌లిపి
కాంగ్రెస్ -      2334                     2243                                    4577 (53.41 %)
బీఆర్ ఎస్    1169                      1187                                      2356 (27.49%)
బీజేపీ -          189                       269                                        457(5.3%)
ఇత‌రులు-      538                      624                                       1162(13.56%)

సిద్దిపేట‌..గులాబీ కంచుకోట
రాష్ట్ర‌మంత‌టా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధిస్తే ఒక్క సిద్దిపేట జిల్లాలో మాత్రం గులాబీ ద‌ళం మెజారిటీ స‌ర్పంచు స్థానాల‌ను గెలుపొంది రివ‌ర్స్ ట్రెండ్ న‌మోదు చేసింది. తొలిద‌శ‌లో 163 స్థానాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా కాంగ్రెస్ 61 చోట్ల బీఆర్ ఎస్ 74 చోట్ల గెలుపొందాయి. రెండో ద‌శ‌కు వ‌చ్చేస‌రికి బీఆర్ ఎస్ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినంత ప‌ని చేసింది. 182 చోట్ల పోటీ జ‌రిగితే 107 స్థానాలను బీఆర్ ఎస్ ద‌క్కించుకున్న‌ది. కాంగ్రెస్ కేవ‌లం 28 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది.

కొన్ని జిల్లాల్లో బీజేపీ జీరో
గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో తొలిసారిగా పోటీ చేశామ‌ని చెప్పుకుంటున్న బీజేపీ ప‌రిస్థితి ఈ సారి దారుణంగా ఉంది. రెండు విడ‌త‌ల్లో క‌లిపి కేవ‌లం 624 చోట్ల గెలిచి 5.3% శాతానికే ప‌రిమిత‌మైంది. అయితే రెండు విడ‌త‌ల్లోనూ ఖ‌మ్మం, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో ఒక్క సీటూ గెల‌వ‌లేక‌పోయింది. తొలి విడ‌త‌లో జ‌న‌గామ‌, పెద్ద‌ప‌ల్లి, ములుగు, మెద‌క్ జిల్లాల్లో ఏ ఒక్క చోట కూడా ఖాతా తెర‌వ‌లేక‌పోయింది.

 

 

Advertisement

తాజావార్తలు

Advertisement