త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suvendu Adhikari | నందిగ్రామ్‌ను వ‌దులుకున్న సువేందు అధికారి.. దీదీ మ‌రో నియోజ‌క‌వ‌ర్గం చూసుకోక త‌ప్ప‌దా!

Suvendu Adhikari | ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి సువేందు అధికారి (Suvendu Adhikari) భ‌వానీపూర్ (Bhabanipur) ఎమ్మెల్యేగానే కొన‌సాగుతాన‌ని ప్ర‌క‌టించారు. నందిగ్రామ్ స్థానాన్ని వ‌దులుకుంటున్న‌ట్లు తెలిపారు.

G

National | Published On May 14, 2026, 7.33 am IST

Suvendu Adhikari | నందిగ్రామ్‌ను వ‌దులుకున్న సువేందు అధికారి.. దీదీ మ‌రో నియోజ‌క‌వ‌ర్గం చూసుకోక త‌ప్ప‌దా!
Advertisement

Suvendu Adhikari | త్రినేత్ర‌.న్యూస్‌: ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి సువేందు అధికారి (Suvendu Adhikari) భ‌వానీపూర్ (Bhabanipur) ఎమ్మెల్యేగానే కొన‌సాగుతాన‌ని ప్ర‌క‌టించారు. నందిగ్రామ్ స్థానాన్ని వ‌దులుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సువేందు అధికారి భ‌వానీపూర్‌, నందిగ్రామ్ (Nandigram) నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి, రెండు చోట్లా విజ‌యం సాధించారు. దీంతో ఒక స్థానాన్ని వ‌దులుకోవాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం అసెంబ్లీలో భ‌వానీపూర్ ఎమ్మెల్యేగా ప్ర‌మాణం చేశారు. త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే ఉపఎన్నిక‌లో నందిగ్రామ్ నుంచి మ‌రొక‌రు ఎమ్మెల్యేగా ఎన్నిక‌వుతార‌ని చెప్పారు.

దీదీ దారెటు..

టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి (Mamata Banerjee) కంచుకోట‌గా ఉన్న భ‌వానీపూర్‌లో సువేందు అధికారి.. 15,105 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. అదే సమయంలో, త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ నందిగ్రామ్‌లో తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి పవిత్ర కర్‌పై 9,665 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తాజాగా నందిగ్రామ్‌ను వ‌దులుకుని భ‌వానీపూర్ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో మాజీ ముఖ్య‌మంత్రి మ‌మ‌త మ‌రో నియోజ‌క‌వ‌ర్గాన్ని చూసుకోక త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఎమ్మెల్యేలకు చేపలతో విందు

నూత‌న ఎమ్మెల్యేల ప్ర‌మాణ స్వీకారం నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సభ్యులకు చేపలతో విందు భోజనం (మచ్ఛ్‌ భాత్‌) ఏర్పాటు చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజల మాంసాహార అలవాటుపై ఉక్కుపాదం మోపుతుందని, తమకు ఇష్టమైన చేపలను బెంగాలీలు తినలేరని విపక్షాలు ప్రచారం చేశాయి. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ విందులో చేపలతో భోజనం ఏర్పాటు చేశారు.
కాగా,

 

Advertisement
Advertisement