Ponnam Prabhakar | ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమాతో ఆర్థిక భరోసా: పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.అయిదు లక్షల జీవిత బీమాతో ప్రజా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు.
Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.అయిదు లక్షల జీవిత బీమాతో ప్రజా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు 4.75 లక్షల నూతన చేయూత పింఛన్లకు అకౌంట్ లో డబ్బులు జమ చేయనున్నట్లు ప్రకటించారు. కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను పొన్నం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిన్న ఇందిరమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారని, దేశంలోనే తొలిసారిగా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించే గొప్ప కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.
గతంలో ఎక్స్‌గ్రేషియా వంటి ఆర్థిక సహాయాలు ప్రధానంగా భూమి కలిగిన రైతులకు మాత్రమే పరిమితమయ్యేవని, కానీ ప్రజాపాలన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఏ వృత్తిలో ఉన్నా, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనున్నామని పొన్నం తెలిపారు. ఈ పథకంలో లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని, మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అర్హులైన కుటుంబాలు సంబంధిత ఫారమ్ ద్వారా నమోదు చేసుకుంటే సరిపోతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 12 వేల గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీడీవోలు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై ప్రతి కుటుంబానికి ఈ పథకం చేరేలా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కుటుంబాలకు జీవిత బీమా భద్రత కల్పించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ప్రజాపాలన ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ప్రజల సంక్షేమం కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపడుతుందని పొన్నం ప్రభాకర్ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, ఇళ్లు లేని అర్హులైన మిగిలిన కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఇళ్లను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజల సంక్షేమం, ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత, ప్రతి పేదవారికి సొంత ఇల్లు కల్పించడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Supreme Court | మేనరిక వివాహాలపై చట్టం తెచ్చే అవసరాన్ని పరిశీలించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●Stock Markets | ఆల్‌టైమ్ హై దిశగా సెన్సెక్స్, నిఫ్టీ.. భారీ ర్యాలీతో ముగిసిన సూచీలు..
- ●Blood Donation Camp | మత్స్యకార దినోత్సవానికి కాంగ్రెస్ సేవా స్ఫూర్తి!
- ●Nitin Nabin Karimnagar Tour | 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
- ●Lava Smart 4 Pro | రూ.10వేలకే లావా కొత్త స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ..
- ●Nivetha Thomas | నేషనల్ అవార్డ్ సినిమా చేసినా... ఛాన్స్‌లు నిల్ - ఓటీటీలోకి నివేదా థామస్ ఎంట్రీ

Supreme Court | మేనరిక వివాహాలపై చట్టం తెచ్చే అవసరాన్ని పరిశీలించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Stock Markets | ఆల్‌టైమ్ హై దిశగా సెన్సెక్స్, నిఫ్టీ.. భారీ ర్యాలీతో ముగిసిన సూచీలు..

Blood Donation Camp | మత్స్యకార దినోత్సవానికి కాంగ్రెస్ సేవా స్ఫూర్తి!

Nitin Nabin Karimnagar Tour | 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్




