Samyuktha | సంయుక్తకు ఇదేం పరీక్ష..! సినిమాలన్నీ రెడీ.. రిలీజ్ డిలే..!
Samyuktha | టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్లిన నటి సంయుక్త పరిస్థితి ఇప్పుడు కాస్త భిన్నంగా కనిపిస్తోంది. చేతిలో సినిమాలు ఉన్నాయి.. వాటిలో కొన్ని షూటింగ్‌లను కూడా పూర్తి చేసుకున్నాయి. అయినప్పటికీ ఒక్కో సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. దీంతో ఆమె నటించిన చిత్రాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Oct 28, 2026, 6.58 pm IST
Samyuktha | టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్లిన నటి సంయుక్త పరిస్థితి ఇప్పుడు కాస్త భిన్నంగా కనిపిస్తోంది. చేతిలో సినిమాలు ఉన్నాయి.. వాటిలో కొన్ని షూటింగ్‌లను కూడా పూర్తి చేసుకున్నాయి. అయినప్పటికీ ఒక్కో సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. దీంతో ఆమె నటించిన చిత్రాలు ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో సంయుక్త సినిమా వస్తుందంటే విజయంపై అంచనాలు పెరిగేవి. ఇండస్ట్రీలో పలువురు ఆమెను ‘గోల్డెన్ హ్యాండ్’ అని పిలిచేవారు. అయితే కొంతకాలంగా ఆమెకు చెప్పుకోదగ్గ విజయం దక్కకపోవడం, మరోవైపు సినిమాలు విడుదలలో జాప్యం జరగడం చర్చనీయాంశంగా మారింది.
వాయిదాల బాటలో ‘స్వయంభు’..
సంయుక్త నటిస్తున్న చిత్రాల్లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న వాటిలో ‘స్వయంభు’ ఒకటి. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మొదటి నుంచీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల తేదీగా 2026 ఫిబ్రవరి 13ను ప్రకటించి ప్రచార కార్యక్రమాలు సైతం మొదలుపెట్టారు. అయితే ప్రకటించిన తేదీకి సినిమా విడుదల కాలేదు. అప్పటి నుంచి కొత్త విడుదల తేదీపై స్పష్టత లేకపోవడంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. షూటింగ్ పూర్తయినప్పటికీ విడుదల విషయంలో నెలకొన్న జాప్యం సంయుక్తకు కూడా ఎదురుచూపులు తప్పడం లేదు.
పూరి జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’ ఎప్పుడంటే?
మరోవైపు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సంయుక్త నటించిన ‘స్లమ్ డాగ్’ చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పూరి జగన్నాథ్ సినిమాలంటేనే ప్రత్యేకమైన కథనం, విభిన్నమైన పాత్రలు గుర్తుకొస్తాయి. ఈ నేపథ్యంలో సంయుక్త ఆయన దర్శకత్వంలో నటించడం ఆసక్తిని పెంచింది. అయితే, సినిమా విడుదల తేదీపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే మారింది.
‘బ్లాక్ గోల్డ్’దీ అదే పరిస్థితి..
సంయుక్త నటించిన మరో చిత్రం ‘బ్లాక్ గోల్డ్’ కూడా చిత్రీకరణ పూర్తి చేసుకున్నా విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఇలా ఒకటి కాదు.. మూడు సినిమాలు సిద్ధంగా ఉన్నప్పటికీ థియేటర్లలోకి రాకపోవడం ఆమె సినీ ప్రయాణంలో కొంత అనిశ్చితిని సృష్టిస్తోంది. సాధారణంగా వరుసగా సినిమాలు విడుదలైతే నటీనటులకు కొత్త అవకాశాలు రావడంతోపాటు ప్రేక్షకుల్లోనూ గుర్తింపు పెరుగుతుంది. కానీ విడుదలలు ఆలస్యమైతే నటీనటుల కెరీర్‌లోనూ ఒక రకమైన విరామం ఏర్పడుతుంది. ప్రస్తుతం సంయుక్త విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
‘హైందవ’పైనే ఆశలన్నీ..
ఇన్ని సినిమాల మధ్య సంయుక్తకు కొంత ఊరటనిచ్చే విషయం ‘హైందవ’ చిత్రం. ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమాకు తాజాగా నవంబర్‌లో విడుదల కానున్నట్లుగా సమాచారం. దీంతో ఈ చిత్రమైనా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. చాలా రోజులుగా విడుదల కోసం ఎదురుచూస్తున్న సంయుక్త సినిమాల్లో ముందుగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ‘హైందవ’కు దక్కనుంది.
మళ్లీ విజయాల బాటలోకి వస్తుందా?
సంయుక్త సినీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ప్రయాణం ప్రారంభించిన ఆమె, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకున్నది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘భీమ్లా నాయక్’తో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ‘విరూపాక్ష’ విజయం ఆమె కెరీర్‌కు బూస్ట్‌నిచ్చింది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది.
సినిమాల రిలీజ్‌పై ఉత్కంఠ
కెరీర్‌లో విజయాలు సాధించినంత మాత్రాన ప్రతి సినిమా వెంటనే విడుదలవుతుందని చెప్పలేమని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. సినిమా నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఇతర ప్రణాళికలు వంటి అంశాలు విడుదల తేదీలపై ప్రభావం చూపుతుంటాయి. సంయుక్త నటించిన చిత్రాల విషయంలోనూ విడుదల జాప్యమే ప్రధానంగా కనిపిస్తోంది. ఈ సినిమాలన్నీ వరుసగా విడుదలైతే ఆమెకు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి మంచి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ‘హైందవ’ ఫలితం, ఆ తర్వాత విడుదలయ్యే సినిమాల స్పందన మలయాళి బ్యూటీ కెరీర్‌పై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సంయుక్తకు సినిమాలకు కొదవ లేకపోయినా.. అవి ప్రేక్షకుల ముందుకు రావడమే ఇప్పుడు కీలకంగా మారింది. విడుదలకు సిద్ధమైన చిత్రాలు ఒక్కొక్కటిగా థియేటర్లలోకి వస్తే ఆమె కెరీర్‌కు కీలకమయ్యే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Police Digital Initiatives | 15 సెకన్లలో నేరగాళ్ల గుర్తింపు: తెలంగాణ పోలీసుల సరికొత్త అస్త్రాలు
- ●Vaishnavi Sharma | వైష్ణవి శర్మ స్పిన్ మ్యాజిక్.. జింబాబ్వే 131 ఆలౌట్!
- ●Jalamandali | అక్రమంగా అమర్చిన 13 మోటార్లు స్వాధీనం
- ●ACB | ఏసీబీకి చిక్కిన లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్, పెట్రోల్ బంక్ టెక్నీషియన్
- ●DPDP Act | పత్రికా స్వేచ్ఛకు ముప్పేమీ లేదు.. డీపీడీపీ చట్టంపై అశ్విని వైష్ణవ్ కామెంట్స్
- ●MLA Sudheer Reddy | మూసీ ప్రాజెక్టులో రియల్ ఎస్టేట్ వ్యాపారం

Telangana Police Digital Initiatives | 15 సెకన్లలో నేరగాళ్ల గుర్తింపు: తెలంగాణ పోలీసుల సరికొత్త అస్త్రాలు

Vaishnavi Sharma | వైష్ణవి శర్మ స్పిన్ మ్యాజిక్.. జింబాబ్వే 131 ఆలౌట్!

Jalamandali | అక్రమంగా అమర్చిన 13 మోటార్లు స్వాధీనం

ACB | ఏసీబీకి చిక్కిన లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్, పెట్రోల్ బంక్ టెక్నీషియన్




