త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Panchayat Elections | 22న బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న నూత‌న స‌ర్పంచ్‌లు

Panchayat Elections | మూడు ద‌శ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల (Panchayat Elections) అనంత‌రం నూత‌న స‌ర్పంచు (Sarpanch) ల ప‌ద‌వీ బాధ్య‌తల స్వీక‌ర‌ణ‌ను ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీకి వాయిదా వేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం (Government) ఉత్త‌ర్వులు జారీ చేసింది.

A

News | Published On Dec 17, 2025, 2.00 pm IST

Panchayat Elections | 22న బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్న నూత‌న స‌ర్పంచ్‌లు
Advertisement

Panchayat Elections | నూత‌న స‌ర్పంచు (Sarpanch) ల అపాయింట్ డే రాష్ట్ర ప్ర‌భుత్వం (Government) వాయిదా వేసింది. దీనిని ఈనెల 20 నుంచి 22 తేదీకి వాయిదా వేస్తూ పంచాయ‌తీరాజ్ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నెల 20న స‌రైన ముహూర్తాలు లేవ‌ని, 22వ తేదీకి వాయిదా వేయాల‌ని ప్ర‌జా ప్ర‌తినిధుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞ‌ప్తులు రావ‌డంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. మూడు ద‌శ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌లు (Panchayat Elections) బుధ‌వారంతో ముగిశాయి. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా నూత‌న స‌ర్పంచ్‌లు అదే తేదీన ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకోనున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement