New districts in Ladakh | లద్దాఖ్‌లో కొత్త జిల్లాలు.. ఐదింటికి ఎల్జీ ఆమోద ముద్ర
New districts in Ladakh | కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్ (Ladakh)లో పరిపాలనా సంస్కరణల దిశగా కీలక అడుగు పడింది. కొత్తగా ఐదు జిల్లాల ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (Vinay Kumar Saxena) ఆమోద ముద్ర వేశారు. నుబ్రా, షామ్, జన్‌స్కర్, ద్రాస్, చాంగ్‌థాంగ్ జిల్లాలు ఏర్పాటు కానున్నట్లు వెల్లడించారు.
New districts in Ladakh | త్రినేత్ర.న్యూస్: కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్ (Ladakh)లో పరిపాలనా సంస్కరణల దిశగా కీలక అడుగు పడింది. కొత్తగా ఐదు జిల్లాల ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా (Vinay Kumar Saxena) ఆమోద ముద్ర వేశారు. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపినట్లు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు. ఇదొక చరిత్రాత్మక రోజు అని, ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని పేర్కొన్నారు. నుబ్రా, షామ్, జన్‌స్కర్, ద్రాస్, చాంగ్‌థాంగ్ జిల్లాలు ఏర్పాటు కానున్నట్లు వెల్లడించారు.

ఏడుకు జిల్లాల సంఖ్య...
కాగా ఇప్పటివరకు లద్దాఖ్‌లో లేహ్, కార్గిల్ అనే రెండు జిల్లాలే ఉండేవి. ఇప్పుడు కొత్తగా మరో ఐదు జిల్లాలు ఏర్పాటు కానుండడంతో మొత్తం జిల్లాల సంఖ్య రెండు నుంచి ఏడుకు పెరగనుంది. పరిపాలన సౌలభ్యం, పారదర్శకత కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు వినయ్ కుమార్ సక్సేనా చెప్పారు. ఈ నిర్ణయంతో వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా సాగే అవకాశం ఉంటుందన్నారు. ఉపాధి పెరగనుందని తెలిపారు.

2019లో రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా..
లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2024, ఆగస్టులో తెలిపిన విషయం విదితమే. ఇక త్వరలోనే హోం మంత్రి అమిత్ షా లద్దాఖ్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఐదు జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల కావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోద తెలిపారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు.
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 2 రాశి ఫలాలు.. ఈ రాశివారి కోరికలు నెరవేరుతాయి!
- ●CJI Justice Surya Kant | మధ్యవర్తిత్వం భారతీయ సంస్కృతిలో భాగమే : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
- ●Riddhi Kumar | సెల్ఫీ ఫొటోలు షేర్ చేసిన రాజాసాబ్ హీరోయిన్
- ●Telangana Rising-2047 | ‘తెలంగాణ రైజింగ్-2047’లో భాగస్వాములు కండి.. మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు
- ●Mirnalini Ravi | ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ - గర్ల్‌ఫ్రెండ్స్ డే రోజు గుడ్‌న్యూస్
- ●Tollywood | ఆగస్ట్ బరిలో స్టార్స్ - టాక్సిక్ తో పాటు ఈ నెలలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

Horoscope | ఆగస్టు 2 రాశి ఫలాలు.. ఈ రాశివారి కోరికలు నెరవేరుతాయి!

CJI Justice Surya Kant | మధ్యవర్తిత్వం భారతీయ సంస్కృతిలో భాగమే : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

Riddhi Kumar | సెల్ఫీ ఫొటోలు షేర్ చేసిన రాజాసాబ్ హీరోయిన్

Telangana Rising-2047 | ‘తెలంగాణ రైజింగ్-2047’లో భాగస్వాములు కండి.. మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు






