Delhi | తెలంగాణ భవన్‌లో ఎంపీ బలరాం నాయక్‌కు అవమానం
Delhi | ఢిల్లీ (Delhi) లోని తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మహబూబాబాద్ (Mahabubabad) ఎంపీ (MP) బలరాం నాయక్ (Balram Nayak)కు తీవ్ర అవమానం ఎదురైంది. భవన్‌లోని విలేకరుల సమావేశానికి హాల్ కావాలని అడిగితే, దానికి నిరాకరించడమే కాకుండా దురుసుగా సమాధానమిచ్చారని ఆరోపించారు
Delhi | ఢిల్లీ (Delhi) లోని తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో తనకు ఘోర అవమానం జరిగినట్టు మహబూబాబాద్ (Mahabubabad) కాంగ్రెస్ ఎంపీ (MP) బలరాం నాయక్ (Balram Nayak) తెలిపారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో పీఆర్‌వోగా పనిచేస్తున్న చక్రవర్తి తనతో దురుసుగా మాట్లాడారని, ఎంపీగా తన గౌరవాన్ని దెబ్బతీశారన్న ఆయన ఆరోపించారు. ఎంపీల మీడియా సమావేశాలు నిర్వహించే గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌ను తనకు ఇవ్వడానికి చక్రవర్తి నిరాకరించారని చెప్పాడు. గురజాడ హాల్లో విలేకరుల సమావేశం పెట్టాలనుకుంటున్నానని ఫోన్ చేస్తే 'కుదరదు, బయట పెట్టుకోండి' అని దురుసుగా సమాధానం ఇచ్చాడని మండిపడ్డారు. బంజారా సమాజానికి చెందిన ఎంపీని తక్కువగా చూసే ధోరణితో చక్రవర్తి ప్రవర్తించారన్న ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా అక్కడ పనిచేస్తూ తనకు ఎదురు లేదన్నట్టు అహంకారంతో వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికై, ఒకసారి కేంద్రమంత్రిగా కూడా పనిచేశానని, తన పట్ల ఆ రీతిగా ప్రవర్తించేందుకు పీఆర్‌వో స్థాయి ఎంత అని ప్రశ్నించారు. తనకు జరిగిన అవమానంపై సీఎం రేవంత్ రెడ్డికి అధికారికంగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Manne Krishank | వేం నరేందర్‌రెడ్డి అసైన్డ్ భూములను దోచుకుంటున్నడు.. రేవంత్‌రెడ్డితో పోటీ పడుతున్నడు: మన్నే క్రిశాంక్
మే 19, 2026

Bhatti Vikramarka | ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ఉన్నత స్థాయి సమావేశం.. హాజరైన డిప్యూటీ సీఎం
మే 19, 2026

May Flower | విరబూసిన ‘మే’ పుష్పం.. కనువిందు చేస్తున్న ‘బ్లడ్ లిల్లీ’
మే 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



