Manne Krishank | వేం నరేందర్‌రెడ్డి అసైన్డ్ భూములను దోచుకుంటున్నడు.. రేవంత్‌రెడ్డితో పోటీ పడుతున్నడు: మన్నే క్రిశాంక్
Manne Krishank | రాష్ట్రంలోని భూములను రేవంత్ కుటుంబమే దోచుకోవాలా.. మేం దోచుకోవద్దా అన్నట్లు పోటీపడి వేం నరేందర్‌రెడ్డి భూ భారతి ద్వారా అసైన్డ్ భూములు కాజేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిశాంక్ ఆరోపించారు. వేం నరేందర్ రెడ్డి కొడుకు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అనేక అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని మడిపడ్డారు.
- కొడుకు వేం కృష్ణభార్గవ్ రెడ్డి అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ అయి ఉన్నవి
- అప్పటి మహబూబాబాద్ కలెక్టర్, అధికారుల సంతకాలు కూడా ఉన్నయ్
- 2010, 2015 ఎన్నికల అఫిడవిట్లలో లేని భూమి 2026లో ఎలా వచ్చింది?
- శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్ పేరు మీద అక్రమంగా రాశారు
- మీడియా సమావేశంలో మన్నే క్రిశాంక్ ఫైర్
Manne Krishank | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలోని భూములను రేవంత్ కుటుంబమే దోచుకోవాలా.. మేం దోచుకోవద్దా అన్నట్లు పోటీపడి వేం నరేందర్‌రెడ్డి భూ భారతి ద్వారా అసైన్డ్ భూములు కాజేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిశాంక్ ఆరోపించారు. 2010, 2015 ఎన్నికల అఫిడవిట్లలో లేని భూమి.. 2026 రాజ్యసభ అఫిడవిట్‌లో ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వేం నరేందర్ రెడ్డి కొడుకు వేం కృష్ణ భార్గవ్ రెడ్డి పేరిట అనేక అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని మడిపడ్డారు. ఈ మేరకు ఆయన తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు.
కలెక్టర్ సాయం చేశాడని పదవి ఇచ్చిండు..
సాయికృష్ణ గ్రానైట్స్ పేరిట వేం నరేందర్ రెడ్డి సతీమణి వేం విజయలక్ష్మి పేరిట మైనింగ్ అనుమతులు తీసుకున్నారు. కానీ అదే మైనింగ్ అనుమతి తీసుకున్న సర్వే నంబర్లలో ఉన్న అసైన్డ్ భూములు వేం నరేందర్ రెడ్డి కొడుకు పేరు మీద ఉన్నట్లు భూ భారతిలో నమోదైంది. ఆ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కోసం అప్పటి మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌తో పాటు ఉన్నతాధికారులు కూడా సంతకాలు చేశారు. తన అక్రమ భూముల దందాకు సహాయం చేశాడని అదే కలెక్టర్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు స్పెషల్ సెక్రటరీ పదవి ఇచ్చాడు అని క్రిశాంక్ ఫైరయ్యారు.

విజయ లక్ష్మి పేరు మీద శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్..
అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూముల్లో వేం నరేందర్ రెడ్డి మైనింగ్ చేస్తున్నాడు. 2010లో, 2015లో వేం నరేందర్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్లో అసైన్డ్ భూములు గురించి ఎక్కడా లేదు. కానీ 2026లోని ఎలక్షన్ అఫిడవిట్లో వాటి వివరాలు ఉన్నాయి. వేం నరేందర్ రెడ్డి భార్య విజయ లక్ష్మి పేరు మీద ఉన్న శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్ కంపెనీ కింద ఈ భూములు ఉన్నాయి. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూముల సర్వే నంబర్, శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్ కంపెనీ ఉన్న భూములు ఒకటే సర్వే నంబర్ కింద ఉన్నాయి. అవి అసైన్డ్ భూములని ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ సంతకాలు కూడా ఉన్నాయి.
రేవంత్‌తోటి పాత సోపతి నాది.. నేనూ భూములు కాజేసుకోవద్దా అని వేం నరేందర్‌రెడ్డి భూములు కాజేసిండు. ఇద్దరు ఓటుకు నోటు కేసులో ఉన్నోళ్లే. వేం కృష్ణభార్గవ్ రెడ్డి పేరుఉ మీద సర్వేనంబర్ 15\10 ఖాతా నంబర్ 330, 7\10 ఖాతా నంబర్ 330.. ఇలా ఏడు పాస్‌బుక్కుల వివరాలు బయటకి తీశాం. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ను బదిలీ చేస్తే అక్కడి రైతులు మిఠాయిలు పంచుకున్న పరిస్థితిని చూశాం అని క్రిశాంక్ పేర్కొన్నారు.
లోకాయుక్తను ఆశ్రయిస్తాం..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు చెందిన అసైన్డ్ భూములను భూ భారతి పోర్టల్ ద్వారా అక్రమంగా వేమ్ నరేందర్ రెడ్డి కుమారుడు వేమ్ కృష్ణ భార్గవ్ రెడ్డి పేరుపై మార్చారని పేర్కొన్నారు. సుమారు 15 ఎకరాల భూములు ఈ కుటుంబానికి అనుసంధానమై ఉన్నాయని, ఆ భూముల్లో “శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్” పేరుతో బ్లాక్ గ్రానైట్ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సంస్థ వేమ్ నరేందర్ రెడ్డి భార్య వేమ్ విజయలక్ష్మి పేరుతో నడుస్తోందని చెప్పారు. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ లోకాయుక్తను ఆశ్రయించడమే కాకుండా కోర్టుల్లో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలు చేయనున్నట్లు చెప్పారు. సంబంధిత అధికారులకు అధికారిక ఫిర్యాదులు సమర్పించనున్నట్లు క్రిశాంక్ తెలిపారు.
క్రిషాంక్ డిమాండ్లివే..
- అసైన్డ్ భూములను వెంటనే రద్దు చేసి అసలు లబ్ధిదారులకు తిరిగి అప్పగించాలి
- భూ బదిలీలు, మైనింగ్ కార్యకలాపాలపై న్యాయపరమైన విచారణ జరపాలి
- యాజమాన్య మార్పులు, మైనింగ్ అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
- భూ భారతి వ్యవస్థ దుర్వినియోగంపై వేమ్ నరేందర్ రెడ్డి, అప్పటి కలెక్టర్‌పై విచారణ జరపాలి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



