త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Modern cow shelter in Yenkapally | ప్ర‌పంచ స్థాయి హంగుల‌తో ఆధునిక గోశాల‌.. యెంక‌ప‌ల్లిలో శంకుస్థాప‌న చేసిన ముఖ్య‌మంత్రి

CM Revanth Reddy | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం యెంకపల్లి (Yenkapally) గ్రామంలో ఆధునిక గోశాల (Modern cow shelter) నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శ‌నివారం శంకుస్థాప‌న (Foundation stone laying ceremony) చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ గోశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన‌ట్లు సీఎం తెలిపారు. అమ‌లు బాధ్య‌త‌ను హెచ్ఎండీఏ కు అప్ప‌గించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

S

News | Published On Mar 28, 2026, 4.06 pm IST

Modern cow shelter in Yenkapally |  ప్ర‌పంచ స్థాయి హంగుల‌తో ఆధునిక గోశాల‌.. యెంక‌ప‌ల్లిలో శంకుస్థాప‌న చేసిన ముఖ్య‌మంత్రి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం యెంకపల్లి (Yenkapally) గ్రామంలో ఆధునిక గోశాల (Modern cow shelter) నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శ‌నివారం శంకుస్థాప‌న (Foundation stone laying ceremony) చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ గోశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన‌ట్లు సీఎం తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. కనీసం 1000 ఆవులను సంరక్షించేందుకు ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్న‌ట్లు వివ‌రించారు. ఈ ప్రాజెక్టు అంచ‌నా వ్యయం సుమారు రూ.157 కోట్లు ఉంటుంద‌ని.. దీని అమ‌లు బాధ్య‌త‌ను హెచ్ఎండీఏ కు అప్ప‌గించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. పనులు పూర్తయిన అనంతరం నిర్వహణ బాధ్యతను పశుసంవర్ధక శాఖకు అప్పగిస్తామ‌ని వివ‌రించారు.

గో సేవ‌పై అవ‌గాహ‌న..

గ్రామంలోని సర్వే నం.180లో ఉన్న సుమారు 99 ఎకరాల‌ 14 గుంటల ప్రభుత్వ భూమిని ఇందుకు కేటాయించామ‌న్నారు. పశుసంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని చెప్పారు. పశువుల ఆరోగ్యం, పర్యావరణ స్థిరత్వం, ప్రజల్లో గో సేవపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని వెల్ల‌డించారు.

అత్య‌వ‌స‌ర చికిత్స విభాగం..

BIS ప్రమాణాల ప్రకారం నిర్మించే గోశాల షెడ్లు, క్వారంటైన్ సౌకర్యాలు, అత్యవసర చికిత్స విభాగం, మిల్కింగ్ పార్లర్, పాల ప్రాసెసింగ్ యూనిట్ వంటి మౌలిక వసతులు ఏర్పాటవుతాయ‌న్నారు. అవుట్ పేషెంట్ విభాగం, శస్త్రచికిత్స గది, ఐసోలేషన్ వార్డులు, ఫార్మసీ, ఎక్స్-రే గది, పాథాలజీ ల్యాబ్ తదితర సౌకర్యాలతో కూడిన ఆధునిక పశువైద్య ఆసుపత్రి కూడా నిర్మించ‌నున్న‌ట్లు చెప్పారు.

బ‌యోగ్యాస్ ప్లాంట్‌...

పశువుల ఎరువుతో బయోగ్యాస్, సీఎన్‌జీ ఉత్పత్తి చేసే ప్లాంట్, నీటి పునర్వినియోగం కోసం సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (STP), 3–4 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. మేత సాగు కోసం 54 ఎకరాలకు పైగా భూమిలో పచ్చి మేత పంటలు సాగు చేస్తారు. ఇతర సౌకర్యాలలో పరిపాలనా భవనం, అంతర్గత సీసీ రహదారులు, పార్కింగ్, సిబ్బంది నివాస గృహాలు, గోపూజ కోసం ఆలయ సముదాయం, శాస్త్రీయ వ్యర్థ నిర్వహణ కోసం ఇన్సినరేషన్ యూనిట్ ఏర్పాటు చేస్తారు. సందర్శకుల కోసం సమీపంలోని చెరువును అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ ఎయిర్ థియేటర్, పిల్లల ఆట స్థలాలు సైతం ఏర్పాటు చేయనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement