త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Kavitha | ఎమ్మెల్సీ క‌విత రాజీనామా ఆమోదం పొందేనా?

ఎమ్మెల్సీ క‌విత 4 నెల‌ల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ చెప్పి అటు బీఆర్ ఎస్ పార్టీ స‌భ్య‌త్వానికి ఇటు బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న రాజీనామాను ఆమోదించాల‌ని జాగృతి బృందంతో మండ‌లి చైర్మ‌న్ వ‌ద్ద‌కు లేఖ పంపారు.

a

News | Published On Dec 29, 2025, 9.13 am IST

MLC Kavitha | ఎమ్మెల్సీ క‌విత రాజీనామా ఆమోదం పొందేనా?

సంక్షిప్త సారాంశం

బీఆర్ ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆ పార్టీ ఎమ్మెల్సీ క‌విత త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి సెప్టెంబ‌ర్ 3న (2025) రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కు 4 నెల‌లు గడిచిపోయినా ఆ రాజీనామా లేఖ శాస‌న మండ‌లి చైర్మన్‌ వ‌ద్దే పెండింగులో ఉంది. ఈ రోజు (2025 డిసెంబ‌రు 29) నుంచి శాస‌న స‌భ స‌మావేశాలు ప్రారంభం అవుతున్న త‌రుణంలో ఎమ్మెల్సీ క‌విత త‌న రాజీనామాను ఆమోదించుకోనున్నారా? లేక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగానే స‌భ‌లో కొన‌సాగ‌నున్నారా?

Advertisement

ఇప్ప‌టికి మండ‌లి చైర్మ‌న్‌ వ‌ద్దే... పెండింగ్‌లో ఉన్న లెట‌ర్‌
పున‌రాలోచించుకోమ‌ని చెప్పిన చైర్మ‌న్ గుత్తా
ఆ త‌ర్వాత రాజీనామా ప్ర‌స్తావ‌నే ఎత్త‌ని క‌విత
ట్విట‌ర్ హ్యాండిల్ లో ఎమ్మెల్సీ ప‌దం తొల‌గింపు

 

trinethra.news: ప‌ద‌వుల‌పై త‌న‌కెప్పుడూ ఆశ‌లేద‌ని కేవ‌లం ...ఆ నాడు రాష్ట్ర సాధ‌న కోసం ఒంట‌రిగా పోరాడుతున్న కేసీఆర్ గారికి అండ‌గా ఉండేందుకే తాను ఉద్య‌మంలోకి అడుగుపెట్టాన‌ని.. ఎలాంటి ప‌ద‌వులైనా త‌న‌కు తృణ‌ప్రాయ‌మంటూ ...ఎమ్మెల్సీ క‌విత 3 నెల‌ల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ చెప్పి అటు బీఆర్ ఎస్ పార్టీ స‌భ్య‌త్వానికి ఇటు బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న రాజీనామాను ఆమోదించాల‌ని జాగృతి బృందంతో మండ‌లి చైర్మ‌న్ వ‌ద్ద‌కు లేఖ పంపారు. ఆ త‌ర్వాత ఫోన్‌లో ఆమె..మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి తో్ మాట్లాడి త‌న రాజీనామాను ఆమోదించాల‌ని కూడా విన్న‌వించారు. కానీ అందుకు చైర్మ‌న్ గుత్తా స‌సేమిరా అన్నారు. ఆమె కేవ‌లం భావోద్వేగంలో తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని చెబుతూ..రాజీనామాను ఆమోదించ‌లేదు.

ఎమ్మెల్సీ, బీఆర్ ఎస్ ప‌దాల‌ను తొల‌గించి..

2025 సెప్టెంబ‌ర్ 3న త‌న ఎమ్మెల్సీ సభ్యత్వానికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. బీఆర్ ఎస్ పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన త‌ర్వాత అదే రోజు ప్రెస్‌మీట్ పెట్టారు. బీఆర్ ఎస్ పార్టీ స‌భ్య‌త్వానికి, ఎమ్మెల్సీ ప‌ద‌వికి అనంతరం జాగృతి నాయకులు ఆ లేఖను మండలి ఛైర్మన్‌కు అందజేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కవిత ఫోన్‌లో మాట్లాడారు. తన రాజీనామా ఆమోదించాలని కోరారు. కాగా తాను అందుబాటులో లేనని, హైద‌రాబాద్‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆమెతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని గుత్తా సుఖేందర్​ రెడ్డి తెలిపారు. ఇదే స‌మ‌యంలో ఎక్స్ ఖాతాలో బయోను కవిత మార్చుకున్నారు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అనే పదాలు తొలగించారు. మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి ఫౌండర్‌ కొత్తగా యాడ్​ చేశారు.. అయితే చైర్మ‌న్ హైద‌రాబాద్‌కు వ‌చ్చిన త‌ర్వాత ఎమ్మెల్సీ క‌విత వైపు నుంచి ఎలాంటి స్పంద‌న రాలేద‌ని చైర్మ‌న్ వెల్ల‌డించారు.

 

ఇప్ప‌టిదాకా చైర్మ‌న్ ను క‌ల‌వ‌ని క‌విత‌

క‌విత రాజీనామా ఆమోదం పొందాలంటే ఆమె శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిని నేరుగా క‌ల‌వాల్సి ఉంటుంది. త‌న రాజీనామాకు స‌హేతుక‌మైన కార‌ణాల‌ను వివ‌రించాల్సి ఉంటుంది. అయితే ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత ఈ ప్రొటోకాల్ ఏదీ పాటించ‌నందువ‌ల్లే ఇంకా రాజీనామా పెండింగ్‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఈ రోజు నుంచి ప్రారంభ‌మ‌వుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా మండ‌లి స‌మావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేస్తారా ఆ ప‌ద‌విలో కొన‌సాగుతారా అన్న‌ది వేచి చూడాల్సిందే

ఎమ్మెల్సీ క‌విత ప్ర‌స్థానం

క‌విత‌.. 1978 మార్చి 13న కరీంనగర్ జ‌న్మించారు. హైద‌రాబాద్‌లోని స్టాన్లీ బాలికల పాఠశాలలో విద్యనభ్యసించారు. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. 2001లో అమెరికన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. మెకానిక‌ల్ ఇంజ‌నీరు అయిన దేవ‌న‌ప‌ల్లి అనిల్‌ను వివాహ‌మాడారు. ఆ త‌ర్వాత అమెరికా వెళ్లి వెన‌క్కి వ‌చ్చి తెలంగాణ ఉద్య‌మంలో పాలు పంచుకున్నారు. 2006 ఆగస్టులో తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశారు. 2014లో ఆమె 16 వ లోక్‌సభకు నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికైనారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పై ఓడిపోయారు. 2020 అక్టోబరులో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోటీ చేసి 672 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిచారు. తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పేరును టిఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది.నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా క‌విత ఏకగ్రీవంగా ఎన్నికై 2022 జనవరి 19న రెండవసారి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 2024 మార్చి 15న కవిత ఇంటిపై మధ్యాహ్నం నుండి సోదాలు నిర్వహించిన ఈడీ, ఐటీ అధికారులు సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆమెను అరెస్టు చేసింది.7 నెల‌ల పాటు జైలులో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 27న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె సెప్టెంబర్ 3న హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

 

 

 

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement