త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sammakka Sarakka | సమ్మక్క ,సారక్కలను దర్శించుకున్న మంత్రి సీతక్క

Sammakka Sarakka | స‌మ్మ‌క్క‌, సార‌క్క (Sammakka Sarakka) దేవ‌త‌ల‌ను మంత్రి సీత‌క్క (Seethakka) సోమ‌వారం ద‌ర్శించుకుని, ఆల‌య అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించారు.

A

News | Published On Dec 15, 2025, 1.56 pm IST

Sammakka Sarakka | సమ్మక్క ,సారక్కలను దర్శించుకున్న మంత్రి సీతక్క
Advertisement

Sammakka Sarakka | త్వ‌ర‌లో స‌మ్మ‌క్క, సారక్క (Sammakka Sarakka) జాత‌ర ప్రారంభం కానున్న నేప‌థ్యంలో రాష్ట్ర మంత్రి సీత‌క్క (Seethakka) దేవాల‌యాన్ని సోమ‌వారం ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా మేడారం దేవాలయం అభివృద్ధి పనులను ఆమె ప‌రిశీలించారు. గ‌ద్దెల పున‌రుద్ధ‌ర‌ణ‌, అభివృద్ధి ప‌నులు, ప‌గిడిగిద్ద‌రాజు, గోవింద‌రాజుల గ‌ద్దెల రాతి నిర్మాణాలు, రాతిస్తంభాల స్థాప‌న నిర్మాణ ప‌నుల‌ను ఆమె క్షేత్ర‌స్థాయిలో తిరిగి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ప‌నుల‌ను నిర్ణీత గ‌డువులోగా, నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆమె వెంట భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావు, స్థానిక కాంగ్రెస్ నాయ‌కులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement