త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Seethakka | గాంధీని మరోసారి బీజేపీ హత్య చేసింది

27 లేదా 28 తేదీలో కొత్త సర్పంచులు, వార్డు మెంబర్లతో గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సర్పంచులు, ఉపసర్పంచులకు ఈ సందర్భంగా మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు.

J

Hyderabad | Published On Dec 22, 2025, 7.33 pm IST

Seethakka | గాంధీని మరోసారి బీజేపీ హత్య చేసింది
Advertisement

Seethakka | ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునే బాధ్యత మనందరిదీ అని తెలంగాణ మంత్రి సీతక్క అన్నారు. గాంధీ భవన్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలని గ్రామాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తాం. 27 లేదా 28 తేదీల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. వలసలు తగ్గించేందుకు, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం జాతీయ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చామన్నారు.

ఉపాధి హామీ చట్టానికి బీజేపీ ఉరేసింది. ఉపాధి హామీ చట్టానికి గాంధీ పేరు తీసేసి గాంధీని మరోసారి బీజేపీ హత్య చేసింది. ఉపాధి హామీ చట్టాన్ని తీసేసి మళ్లీ వెట్టి చాకిరి విధానాన్ని తేవాలని బీజేపీ ఆలోచిస్తోంది. ఉపాధి హామీ పథకంలో కేంద్రం ప్రతి సంవత్సరం పని దినాలను తగ్గిస్తూ వస్తోంది.

సొంత ఊర్లో పని హక్కు లేకుండా బీజేపీ చేస్తోంది. అదానీ అంబానీ వంటి కార్పోరేట్ల మైనింగ్ తవ్వకాలకు కూలీలను సరఫరా చేసేందుకు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తున్నారు. ఉపాధి చట్టాన్ని రద్దు చేస్తే గ్రామాల్లో కూలీలకు పని ఉండదు. ఆ కూలీలు తక్కువ కూలికే కార్పొరేట్లకు లభిస్తారు.

కేంద్ర ప్రభుత్వ కుక్కలను అందరూ తిప్పి కొట్టాలి. కేంద్రం బిక్షగా కాకుండా ఉపాధి హక్కుగా లభించే విధంగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని అందరూ కాపాడుకోవాలి. కేంద్రం తెచ్చిన కొత్త చట్టానికి మేం వ్యతిరేకం. ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలని గ్రామాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తాం.

27 లేదా 28 తేదీలో కొత్త సర్పంచులు, వార్డు మెంబర్లతో గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సర్పంచులు, ఉపసర్పంచులకు ఈ సందర్భంగా మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement