త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MBBS | 11 ఏండ్ల‌కే పెండ్లి.. 20 ఏండ్ల వ‌య‌స్సులో తండ్ర‌య్యాడు.. అయినా ఎంబీబీఎస్ కలను సాకారం చేసుకున్నాడు..

MBBS | ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతుండ‌గానే పెద్ద‌లు అత‌నికి పెండ్లి చేశారు. 20 ఏండ్ల వ‌య‌స్సు వ‌చ్చేసారికి ఓ బిడ్డ‌కు తండ్ర‌య్యాడు. అయినా డాక్ట‌ర్ (MBBS) కావాల‌న్న త‌న క‌ల‌ను సాకారం చేసుకున్నాడు.

G

News | Published On Jan 21, 2026, 7.56 am IST

MBBS | 11 ఏండ్ల‌కే పెండ్లి.. 20 ఏండ్ల వ‌య‌స్సులో తండ్ర‌య్యాడు.. అయినా ఎంబీబీఎస్ కలను సాకారం చేసుకున్నాడు..
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతుండ‌గానే పెద్ద‌లు అత‌నికి పెండ్లి చేశారు. 20 ఏండ్ల వ‌య‌స్సు వ‌చ్చేసారికి ఓ బిడ్డ‌కు తండ్ర‌య్యాడు. అయినా డాక్ట‌ర్ (MBBS) కావాల‌న్న త‌న క‌ల‌ను సాకారం చేసుకున్నాడు. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా ల‌క్ష్యం వైపు ముందుకు సాగాడు. ఒక‌టి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదుసార్లు మెడిసిన్ అర్హ‌త ప‌రీక్ష (NEET UG) రాశాడు. ప్ర‌తీసారి నిరాశే ఎదురైనా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప్ర‌య‌త్నించి నీట్ అడ్డంకిని అదిగ‌మించిని రాజ‌స్థానీ యువ‌కుడి విజ‌య‌గాథ..

రాజస్థాన్‌లోని (Rajasthan) మారుమూల ప్రాంతానికి చెందిన రామ్‌లాల్‌కు ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడే.. త‌ల్లిదండ్రులు వివాహం నిశ్చ‌యం చేశారు. తెలిసీ, తెలియ‌ని వ‌య‌స్సులోనే త‌న 11వ ఏట ఓ ఇంటివాడ‌య్యాడు. ఓ వైపు బాల్యం, మ‌రోవైపు సంసార బాధ్య‌త‌లు.. అయినా ఎంబీబీఎస్ చ‌ద‌వాల‌న్న త‌న ల‌క్ష్యానికి ఇవేవీ అత‌నికి అడ్డురాలేదు.

చదువుకోవ‌డానికి తండ్రి ఒప్పుకోకున్నా.. త‌న భార్య స‌హ‌కారంతో ముందుకు సాగాడు. ఒక్కో త‌ర‌గ‌తి దాటుటూ.. టెన్త్ క్లాస్‌లో 74 శాతం మార్కులు సాధించాడు. ఇంట‌ర్‌లో సైన్స్ విభాగాన్ని ఎంచుకుని ఉత్తీర్ణుడ‌య్యాడు. నెలల తరబడి సన్నద్ధమైన తర్వాత, 2019లో నీట్ పరీక్షకు హాజర‌య్యాడు. అయితే 720 మార్కులకుగాను 350 మార్కులు మాత్రమే సాధించగ‌లిగాడు. అయినా నిరాశపడకుండా తన లక్ష్యంవైపు ముందుకు సాగాడు. ఓ కోచింగ్ సెంట‌ర్‌లో చేరి పరీక్ష‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యాడు.

2022లో మరోసారి నీట్ రాసి.. గ‌తంలో కంటే మెరుగ్గా 490 మార్కులు సాధించాడు. వైఫ‌ల్యాల‌నే విజ‌యాని సోపానంగా మార్చుకున్నాడు. మ‌రింత ఉత్సాహంతో ప‌రీక్ష‌కు ప్రిపేర‌య్యాడు. మంచి ర్యాంకుకోసం క‌ష్ట‌ప‌డ్డాడు. మూడో ప్ర‌య‌త్నంలోనూ అప‌జ‌య‌మే ప‌ల‌క‌రించినా.. ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. చివరికి ఐదు ప్రయత్నంలో 2023లో మంచి ర్యాంకు సాధించి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. కాగా, అదే ఏడాది రామ్‌లాల్‌కు ఒక పాపపుట్టడం విశేషం.

ఎన్ని క‌ష్టాలు ఎదురైనా, ఎవ‌రు అడ్డంకిగా నిలిచినా.. మ‌న‌పై మ‌న‌కు న‌మ్మ‌కం, అనుకున్న‌ది సాధించ‌గ‌ల‌మ‌న్న విశ్వాసం ఉన్న‌ప్పుడు.. విజ‌యం నుంచి మిమ్మ‌ల్ని ఈ ప్ర‌పంచంలో ఎవ‌రూ దూరం చేయ‌లేర‌నేదానికి రామ్‌లాల్ జీవిత‌మే మంచి ఉదాహ‌ర‌ణ‌.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement