త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET Aspirant | ప‌రీక్ష ర‌ద్దు.. నీట్ యూజీ అభ్య‌ర్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

NEET Aspirant | పేప‌ర్ లీక్ అయింద‌న్న కార‌ణంతో ఈ నెల 3న నిర్వ‌హించిన నీట్ యూజీ (NEET UG) ప‌రీక్ష‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. జూన్ 21న ప‌రీక్ష‌ను మ‌ళ్లీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించింది. అయితే ప‌రీక్ష ర‌ద్దుతో (Exam Cancellation) ఒత్తిడికి లోనైన ఓ విద్యార్థి (NEET Aspirant) ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

G

National | Published On May 16, 2026, 9.16 am IST

NEET Aspirant | ప‌రీక్ష ర‌ద్దు.. నీట్ యూజీ అభ్య‌ర్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..
Advertisement

NEET Aspirant | త్రినేత్ర‌.న్యూస్‌: పేప‌ర్ లీక్ అయింద‌న్న కార‌ణంతో ఈ నెల 3న నిర్వ‌హించిన నీట్ యూజీ (NEET UG) ప‌రీక్ష‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. జూన్ 21న ప‌రీక్ష‌ను మ‌ళ్లీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించింది. అయితే ప‌రీక్ష ర‌ద్దుతో (Exam Cancellation) ఒత్తిడికి లోనైన ఓ విద్యార్థి (NEET Aspirant) ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

రాజ‌స్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాకు చెందిన ప్ర‌దీప్ మ‌హిచ్‌.. త‌న ఇద్ద‌రు సోద‌రీమ‌ణుల‌తో క‌లిసి సిక‌ర్‌లో ఓ గ‌దిలో అద్దెకు ఉంటున్నాడు. గ‌త మూడేండ్లుగా నీట్ ప‌రీక్షకు స‌న్న‌ద్ద‌మ‌వుతున్న ప్ర‌దీప్‌.. ప్రైవేటు కోచింగ్ సెంట‌ర్‌లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో మే 3న జ‌రిగిన ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యాడు. అయితే ప‌రీక్ష ర‌ద్దు కావ‌డంతో ఒత్తిడికి గురైన అత‌డు శుక్ర‌వారం.. త‌న గ‌దిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

గ‌మ‌నించిన త‌న సోద‌రి ఇంటి ఓన‌ర్‌కు, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. హాస్పిట‌ల్‌కు త‌ర‌లించేలోపే అత‌డు మృతిచెందాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా, త‌మ కుమారుడు ఈ సారి ప‌రీక్ష బాగా రాశాడ‌ని, 720కిగాను 650 మార్కులు వ‌స్తాయ‌ని న‌మ్మ‌కంగా చెప్పాడ‌ని ప్ర‌దీప్ తండ్రి రాజేశ్ కుమార్ తెలిపారు. త‌న‌కు ప్ర‌భుత్వ కాలేజీలో మెడిక‌ల్ సీటు త‌ప్ప‌నిస‌రిగా వ‌స్తుంద‌ని చెప్పాడ‌ని కుటుంబ స‌భ్యులు వెళ్ల‌డించారు. ఇంత‌లోనే ప‌రీక్ష ర‌ద్దుకావ‌డంతో అత‌డు బ‌ల‌వ‌న్మ‌ర‌నానికి పాల్ప‌డ్డాడ‌ని చెప్పారు.

Advertisement
Advertisement