త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lunar Eclipse | హోలీకి ముందు చంద్రగ్రహణం.. మూడురాశుల వారు తస్మాత్‌ జాగ్రత్త..!

Lunar Eclipse | కామ దహనం రోజున ఖగోళ సంఘటన చోటు చేసుకోబోతున్నది. మార్చి 3న మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర, దక్షిణ అమెరికా, పసిఫిక్ దీవుల్లో కనిపించనున్నది. భారత్‌లోనూ దర్శనమిస్తుంది.

P

Flash news | Published On Mar 2, 2026, 5.15 am IST

Lunar Eclipse | హోలీకి ముందు చంద్రగ్రహణం.. మూడురాశుల వారు తస్మాత్‌ జాగ్రత్త..!
Advertisement

Lunar Eclipse | కామ దహనం రోజున ఖగోళ సంఘటన చోటు చేసుకోబోతున్నది. మార్చి 3న మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర, దక్షిణ అమెరికా, పసిఫిక్ దీవుల్లో కనిపించనున్నది. భారత్‌లోనూ దర్శనమిస్తుంది. అందుకే సూతకం చెల్లుతుంది. జ్యోతిషశాస్త్రంలో చంద్రగ్రహణాలు మానసిక స్థితి, భావోద్వేగాలు, కుటుంబ జీవితంతో ముడిపడి ఉంటాయి. ఈ గ్రహణం 12 రాశిచక్రాలపై శుభ, అశుభ ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మూడురాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. స్వీయ నియంత్రణ అవసరం. ఈ సమయంలో జీవితంలో కొత్త సవాళ్లు ఎదుర్కొంటారు.

వృషభం

వృషభ రాశి జాతకులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. చంద్రగ్రహణం మీ సహనాన్ని, నిర్ణయం తీసుకునే సామర్థ్యానికి పరీక్ష పెడుతుంది. ఈ సమయంలో తీర్థయాత్రలకు దూరంగా ఉండడం మంచిది. జీవితంలో ప్రతికూలను పెంచుతుంది. మీరు ప్రతి సమస్యను మీరే పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే, మీ సహనమే మీకు విజయాలు సాధించడంలో సహాయపడుతుంది. అయితే, పరిస్థితులు వెంటనే అనుకూలంగా ఉండకపోవచ్చు. పనిలో అడ్డంకులు, ప్రణాళికలో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కన్యారాశి

కన్యారాశి వారు కొత్త పనులకు దూరంగా ఉండాలి. కార్యాలయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సీనియర్లు, ఉన్నతాధికారులతో మర్యాదగా ప్రవర్తించండి. ఈ సమయంలో మీ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేయకూడదు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. చిన్న సమస్యను కూడా తేలిగ్గా తీసుకోకూడదు. లేకపోతే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. మాట్లాడే సమయంలో సంయమనం పాటించడం మంచిది. లేకపోతే చిక్కుల్లో పడుతారు. అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి ఈ సమయం కష్టతరంగా ఉంటుంది. పనులు చక్కబెట్టుకునేందుకు కాలంతో పోటీ పడాల్సి వస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో సమతుల్యతను కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక సంబంధిత విషయాల్లో ఆలోచనాత్మక చర్యలు తీసుకోవాలి. మంచి సంబంధాలు కొనసాగించేందుకు కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్‌ను కొనసాగించాలి. తప్పుడు సహవాసంతో భవిష్యత్‌లో సమస్యలు కలిగిస్తాయి.

Read Also :

Mars Transit | కుంభ‌రాశిలో కుజుడి సంచారంతో పంచ‌గ్ర‌హి యోగం.. ఈ రాశుల వారి ప్ర‌మోష‌న్లు, జీతం పెరిగే ఛాన్స్‌..!

Budh Asta | కుంభరాశిలో అస్తమించనున్న బుధుడు.. ఈ మూడురాశుల వారికి అన్నీ గుడ్‌న్యూస్‌లే..!

Advertisement
Advertisement