త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Vijay Kumar | ఢిల్లీ అధికారుల అదుపులో ‘కొండ‌’.. ఒంటిపై బంగార‌మంతా సీజ్

Konda Vijay Kumar | న్యూఢిల్లీ(New Delhi)లో హాకీ ఇండియా అవార్డుల ప్రదానోత్సవానికి బయలుదేరిన తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్ (Konda Vijay kumar) ను పోలీసులు అదుపులోకి (Police custody) తీసుకున్నారు. ఈ బంగారు బాబు ఒంటిపై ఉన్న బంగార‌మంతా సీజ్ (Gold seize) చేశారు. ఆయ‌న‌కు సంబంధించిన‌ స్థిర, చర ఆస్తుల వివరాలను సేకరిస్తున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

S

News | Published On Mar 27, 2026, 4.02 pm IST

Konda Vijay Kumar | ఢిల్లీ అధికారుల అదుపులో ‘కొండ‌’.. ఒంటిపై బంగార‌మంతా సీజ్
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: న్యూఢిల్లీ(New Delhi)లో హాకీ ఇండియా అవార్డుల ప్రదానోత్సవానికి బయలుదేరిన తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్ (Konda Vijay kumar) ను పోలీసులు అదుపులోకి (Police custody) తీసుకున్నారు. ఈ బంగారు బాబు ఒంటిపై ఉన్న బంగార‌మంతా సీజ్ (Gold seize) చేశారు. ఆయ‌న‌కు సంబంధించిన‌ స్థిర, చర ఆస్తుల వివరాలను సేకరిస్తున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

12 గంట‌ల పాటు విచార‌ణ‌..

శేరిలింగంపల్లికి చెందిన బంగారు బాబు, హోప్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహ‌కుడు కొండ విజయ్ కుమార్ గురువారం సాయంత్రం ఢిల్లీకి బ‌య‌లుదేరారు. హైద‌రాబాద్ రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ఆయ‌న‌ను పోలీసులు అడ్డుకొని పాన్‌కార్డు స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం కొండ‌ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంట‌నే అక్క‌డి ఆదాయ ప‌న్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న‌తో పాటు ఉన్న‌వారిని అదుపులోకి తీసుకొని కొండ‌ ఒంటిపైన ఉన్న బంగారం మొత్తాన్ని సీజ్ చేశారు. ఎయిర్‌పోర్టులోనే 12 గంటల పాటు విచారించిన అధికారులు అవార్డుల ప్రదానోత్సవానికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. అనంతరం మళ్లీ వారిని విచారణకు హాజరు కావాల‌ని సూచించారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న‌ కుటుంబ స‌భ్యులు, హోప్ ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు, అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

Advertisement

తాజావార్తలు

Advertisement