త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. సేఫ్ హావెన్ ఆస్తుల‌పై త‌గ్గుతున్న ఆస‌క్తి..

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయంగా చోటు చేసుకుంటున్న అనేక ప‌రిణామాల‌తో బంగారం, వెండి ధ‌ర‌ల్లో తీవ్ర అస్థిర‌త కొన‌సాగుతోంది. అమెరికా డాల‌ర్ రోజు రోజుకీ బ‌ల‌ప‌డుతుండ‌డంతో బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయి. ట్రెజ‌రీ బాండ్ ఈల్డ్స్ పెరుగుద‌ల కూడా బంగారం ధ‌ర‌ల‌పై ప్ర‌భావం చూపుతోంది.

S

Business | Published On May 21, 2026, 11.22 am IST

Gold And Silver Prices Today | స్వ‌ల్పంగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. సేఫ్ హావెన్ ఆస్తుల‌పై త‌గ్గుతున్న ఆస‌క్తి..
Advertisement

Gold And Silver Prices Today | అంత‌ర్జాతీయంగా చోటు చేసుకుంటున్న అనేక ప‌రిణామాల‌తో బంగారం, వెండి ధ‌ర‌ల్లో తీవ్ర అస్థిర‌త కొన‌సాగుతోంది. అమెరికా డాల‌ర్ రోజు రోజుకీ బ‌ల‌ప‌డుతుండ‌డంతో బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయి. ట్రెజ‌రీ బాండ్ ఈల్డ్స్ పెరుగుద‌ల కూడా బంగారం ధ‌ర‌ల‌పై ప్ర‌భావం చూపుతోంది. అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య యుద్ధం ఉన్న‌ప్ప‌టికీ పెట్టుబ‌డిదారులు బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల వైపు మొగ్గు చూప‌డం లేదు. వారు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హరిస్తున్నారు. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.25 శాతం త‌గ్గి 4,478 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 1.03 శాతం పెరిగి 74.97 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. అలాగే దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 755 పాయింట్లు త‌గ్గి 1,58,325 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1464 పాయింట్లు పెరిగి 2,71,583 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,993 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,27, 944 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,59,930 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,99,300 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.4,900 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,660 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,17,280గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,46,600 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,66,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,500 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,995 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.95,960గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,19,950 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,99,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3,700 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,85,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,850గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు పెరిగింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,90,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,900 గా ఉంది.

Advertisement
Advertisement