త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | క‌మోడిటీ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త‌.. పెట్టుబ‌డిదారుల్లో సందిగ్ధ‌త‌..

Gold And Silver Prices Today | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధంపై రోజుకో ప్ర‌క‌ట‌న చేస్తుండ‌డంతో అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త నెల‌కొంది. మార్కెట్లు భారీ ఎత్తున వోల‌టైల్‌గా మారాయి. అదే ప్ర‌భావం క‌మోడిటీ మార్కెట్ల‌పైనా చూపిస్తోంది. దీంతో బంగారం, వెండి ధ‌ర‌ల్లోనూ అస్థిర‌త ఏర్ప‌డింది.

S

Business | Published On May 20, 2026, 11.33 am IST

Gold And Silver Prices Today | క‌మోడిటీ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త‌.. పెట్టుబ‌డిదారుల్లో సందిగ్ధ‌త‌..
Advertisement

Gold And Silver Prices Today | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధంపై రోజుకో ప్ర‌క‌ట‌న చేస్తుండ‌డంతో అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల‌లో తీవ్ర అస్థిర‌త నెల‌కొంది. మార్కెట్లు భారీ ఎత్తున వోల‌టైల్‌గా మారాయి. అదే ప్ర‌భావం క‌మోడిటీ మార్కెట్ల‌పైనా చూపిస్తోంది. దీంతో బంగారం, వెండి ధ‌ర‌ల్లోనూ అస్థిర‌త ఏర్ప‌డింది. అంతర్జాతీయ బులియ‌న్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 0.23 శాతం త‌గ్గి 4,471 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 0.82 శాతం పెరిగి 74.27 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్ లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 541 పాయింట్లు త‌గ్గి 1,58,511 వ‌ద్ద ఉండ‌గా, సిల్వర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 842 పాయింట్లు ప‌డిపోయి 2,69,277 వ‌ద్ద ఉంది. అయితే దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధ‌ర‌లు పెరిగాయి. వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,835 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,26, 680 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,58,350 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,83,500 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.13,100 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,515 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,16,120గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,45,150 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,51,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.12వేలు పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,876 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.95,008గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,18,760 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,87,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9,800 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,80,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,800గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు త‌గ్గింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,85,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,850 గా ఉంది.

Advertisement
Advertisement