Telangana Rising | తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌పై సీఎంకు ఖర్గే, ప్రియాంక అభినందనలు
Telangana Rising | ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి (CM) ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు ఖర్గే (Kharge), ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)లను కలిసి తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్, విజన్ డాక్యుమెంట్ (Vision Document) లపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎంను వారు అభినందించారు.
Telangana Rising | తెలంగాణ రైజింగ్ (Telangana Rising) విజన్ డాక్యుమెంట్ (Vision Document) ఆవిష్కరణపై ముఖ్యమంత్రి (CM) ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Kharge), ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అభినందించారు. తెలంగాణ భవిష్యత్ ముఖచిత్రాన్ని డాక్యుమెంట్ ఆవిష్కరించిందని వారు ప్రశంసించారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను వారి నివాసాల్లో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Global Summit) విజయవంతమైన తీరు, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై వారి మధ్య చర్చ కొనసాగింది. సమ్మిట్‌లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు ఒప్పందాలు చేసుకోవడంపై అగ్ర నేతలు సీఎంను ప్రశంసించారు. సీఎం వెంట మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు సురేశ్ షెట్కార్, ఎం అనిల్ కుమార్, పోరిక బలరాం నాయక్, డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






