త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chanagani Dayakar | పార్టీ మార‌డానికి జీవ‌న్‌రెడ్డికి సిగ్గుండాలి: చనగాని దయాకర్ ఫైర్‌

Chanagani Dayakar | పార్టీ మార‌డానికి జీవన్ రెడ్డికి సిగ్గుండాల‌ని.. ఆయ‌న‌ దొంగలకు సద్దులు మోసే వ్య‌క్తి అని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (Congress General Secretary) చ‌న‌గాని ద‌యాక‌ర్ (Chanagani Dayakar) విమ‌ర్శించారు. పొన్నాల లక్ష్మయ్యకు పట్టిన గతే ఆయ‌న‌కు పడుతుందని, తప్పు చేశానని త్వరలోనే తెలుసుకుంటాడని పేర్కొన్నారు.

S

News | Published On Apr 11, 2026, 2.51 pm IST

Chanagani Dayakar | పార్టీ మార‌డానికి జీవ‌న్‌రెడ్డికి సిగ్గుండాలి: చనగాని దయాకర్ ఫైర్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: పార్టీ మార‌డానికి జీవన్ రెడ్డికి సిగ్గుండాల‌ని.. ఆయ‌న‌ దొంగలకు సద్దులు మోసే వ్య‌క్తి అని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (Congress General Secretary) చ‌న‌గాని ద‌యాక‌ర్ (Chanagani Dayakar) విమ‌ర్శించారు. పొన్నాల లక్ష్మయ్యకు పట్టిన గతే ఆయ‌న‌కు పడుతుందని, తప్పు చేశానని త్వరలోనే తెలుసుకుంటాడని పేర్కొన్నారు. గాంధీ భ‌వ‌న్‌(Gandhi Bhavan)లో ద‌యాక‌ర్‌ శ‌నివారం మీడియా(Press meet)తో మాట్లాడారు. జీవ‌న్‌రెడ్డి మార్టీ మారుతుండ‌డంపై నిప్పులు చెరిగారు. ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడని మండిప‌డ్డారు.

కాంగ్రెస్ ను కాదనుకుని వెళ్లిన వారికి పట్టిన గతే జీవన్ రెడ్డికి పడుతుంది. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి 14 సార్లు బీఫాం ఇచ్చింది. జీవన్ రెడ్డి మెడ‌లో కాంగ్రెస్ కండువా ఉన్నప్పుడే గౌరవం ఉండేది. ఆయ‌న‌కు 70 ఏండ్లు వచ్చేదాక పార్టీ అవకాశాలు ఇచ్చింది. రాష్ట్రంలో మ‌ళ్లీ అధికారంలోకి వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. జీవన్ రెడ్డి లాంటి వాళ్లు వస్తారు, పోతారు. ప్ర‌స్తుతం అనేక మంది నాయకులు పదవులు లేక‌పోవడంతో పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. కానీ ఏ ఒక్క‌రూ జీవన్ రెడ్డి లాగా పదవుల కోసం పార్టీ మారలేదు అని ద‌యాక‌ర్ విరుచుకుప‌డ్డారు.

Advertisement
Advertisement