JEE Main Session 2 Result 2026 | జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు వచ్చేశాయ్
JEE Main Session 2 Result 2026 | దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు (JEE Main Session 2 Result 2026) విడుదలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం తుది కీ ని ఎన్‌టీఏ(NTA) అధికారులు రిలీజ్ చేశారు.
JEE Main Session 2 Result 2026: త్రినేత్ర.న్యూస్: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు (JEE Main Session 2 Result 2026) విడుదలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం తుది కీ ని ఎన్‌టీఏ(NTA) అధికారులు రిలీజ్ చేశారు. కాగా ఇదేరోజు సాయంత్రం పేపర్ -1 (బీఈ/బీటెక్) పరీక్ష తుది ఫలితాలను ప్రకటించారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి స్కోర్ కార్డుని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 2 నుంచి 8 వరకు పరీక్షలు నిర్వహించగా సుమారు 11.23 లక్షల మంది హాజరయ్యారు. ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ పరీక్షలను ఏటా రెండు దశల్లో నిర్వహిస్తారు.
జేఈఈ (మెయిన్) సెషన్ 1, సెషన్ 2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోరును అధికారులు పరిగణనలోకి తీసుకొన్నారు. దీని ఆధారంగానే జాతీయ ర్యాంకులను కేటాయించారు. ఈ పరీక్షల్లో రాణించి టాప్‌లో నిలిచిన మొత్తం 2.50లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. మే 17న జరిగే ఈ పరీక్షకు ఏప్రిల్ 23 నుంచి మే 4 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. ‘అడ్వాన్స్‌డ్’లోనూ సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ తో ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్: jeemain.nta.nic.in
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

NEET UG | అన్నీ సేమ్.. గెస్ పేపర్లో అడిగిన కెమిస్ట్రీ ప్రశ్నలే నీట్ యూజీలో కూడా!
మే 20, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



