Jayesh Ranjan | కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ పనుల్లో వేగం పెంచండి.. ఇంజినీరింగ్ అధికారులకు స్పెషల్ సీఎస్ ఆదేశం
Jayesh Ranjan | బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ జరుగుతున్న ఫ్లైఓవర్ (KBR Park Flyover) పనులను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ (Jayesh Ranjan) క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Jayesh Ranjan | త్రినేత్ర.న్యూస్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ జరుగుతున్న ఫ్లైఓవర్ (KBR Park Flyover) పనులను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ (Jayesh Ranjan) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎల్‌వీ ప్రసాద్, ప్రసాద్ ఐ ఆసుపత్రి నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, రోడ్డు నంబర్ 45 వరకు ఫ్లై ఓవర్ పనుల పురోగతిని జీహెచ్ఎంసీ కర్ణన్, చీఫ్ ఇంజినీర్ సహదేశ్ రత్నాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులను మరింత వేగం చేయాలనీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

ట్రాఫిక్ ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఫ్లైఓవర్ పనులను చేపడుతుందన్నారు. పనులను వేగంగా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతి వారం పనుల పురోగతిని ఇంజినీరింగ్ అధికారులు సమీక్షించాలన్నారు. పనుల్లో మరింత వేగం పెంచేందుకు ఎంఈఐఎల్ (మెగా) సంస్థ అదనంగా మెషిన్ , మ్యాన్ పవర్‌ను సమకూర్చుకోవాలని ఆదేశించారు.
రూ.826 కోట్ల అంచానతో వై-టైప్ అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ నుంచి రోడ్డు నంబర్ 36 వైపు 4 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనుంది. ఇక ముగ్ధ జంక్షన్ వద్ద జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వైపు 2 లేన్ల అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. రెండేండ్లలో ఈ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్





