త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Japan | జ‌పాన్‌లో భూకంపం.. సునామీ క‌ల‌క‌లం..

Japan | జపాన్ (Japan) దేశంలో సోమ‌వారం రాత్రి వ‌చ్చిన భూకంపం (Earthquake) తో సునామీ (Tsunami) వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డంతో తీవ్ర క‌ల‌క‌లం రేగింది

A

News | Published On Dec 9, 2025, 10.01 am IST

Japan | జ‌పాన్‌లో భూకంపం.. సునామీ క‌ల‌క‌లం..
Advertisement

Japan | జ‌పాన్ (Japan) లో సోమ‌వారం రాత్రి భూకంపం (Earthquake) సంభ‌వించింది. ఈ భూకంపంతో మూడు మీట‌ర్ల వ‌ర‌కు అల‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స్థానిక వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. దీంతో తీవ్ర క‌ల‌క‌లం రేగింది. జ‌పాన్ దేశంలో స్థానిక కాల‌మానం ప్ర‌కారం రాత్రి 11.15 నుంచి 11.20 మ‌ధ్య ఈశాన్య తీరానికి స‌మీపంగా సుమారు 7.5-7.6 మాగ్నిట్యూడ్ తీవ్ర‌త‌తో ఈ భూకంపం సంభ‌వించింది. జ‌పాన్ ప్ర‌ధాన ద్వీపం హోన్షూలోని ఆఓమోరి ప్రిఫెక్చ‌ర్ స‌ముద్ర తీరానికి 50-70 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది.

సునామీ హెచ్చ‌రిక‌లు...

జ‌పాన్ వాతావ‌ర‌ణ సంస్థ మూడు మీట‌ర్ల వ‌ర‌కు అల‌లు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని హెచ్చ‌రిస్తూ సునామీ (Tsunami) హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో 50-70 సెంటీ మీట‌ర్ల వ‌ర‌కు అల‌ల‌ను న‌మోదు కావ‌డంతో, ప‌రిస్థ‌తిని తిరిగి అంచ‌నావేసి హెచ్చ‌రిక‌ను అడ్వైజరీగా త‌గ్గించి, మంగ‌ళ‌వారం ఉద‌యం వ‌ర‌కు దానిని పూర్తిగా ఎత్తివేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement