త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Little India | ‘లిటిల్ ఇండియా’పై ఇరాన్ దాడి.. 30 మందికి గాయాలు!

Little India | ప‌శ్చిమాసియా యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా ఇరాన్‌ ఇజ్రాయెల్‌ (Israel)పై బాలిస్టిక్‌ క్షిపణుల (Ballistic missile)తో దాడుల‌కు తెగ‌బ‌డుతోంది. ఈ క్ర‌మంలో ఆదివారం ఆ క్షిపణులు డిమోనా (Dimona) నగరంపై ప‌డ‌డంతో 30 మందికి గాయాలైన‌ట్లు స‌మాచారం.

S

News | Published On Mar 22, 2026, 7.07 pm IST

Little India | ‘లిటిల్ ఇండియా’పై ఇరాన్ దాడి.. 30 మందికి గాయాలు!
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: ప‌శ్చిమాసియా యుద్ధం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా ఇరాన్‌ ఇజ్రాయెల్‌ (Israel)పై బాలిస్టిక్‌ క్షిపణుల (Ballistic missile)తో దాడుల‌కు తెగ‌బ‌డుతోంది. ఈ క్ర‌మంలో ఆదివారం ఆ క్షిపణులు డిమోనా (Dimona) నగరంపై ప‌డ‌డంతో 30 మందికి గాయాలైన‌ట్లు స‌మాచారం. డిమోనా న‌గ‌ర జ‌నాభాలో దాదాపు 30 శాతం భారత సంతతికి చెందినవారు ఉండడం వ‌ల్ల ఈ న‌గ‌రాన్ని ‘లిటిల్ ఇండియా’ (Little India) గా పిలుస్తారు. దశాబ్దాల క్రితమే వారు ఇక్క‌డ‌ స్థిరపడ్డారు. ఇది దక్షిణ ఇజ్రాయెల్‌లోని నెగెవ్ ఎడారిలో ఉంది. ఇది ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రానికి (Shimon Peres Negev Nuclear Research Center) పేరు గాంచడం వ‌ల్ల దీన్ని "అణు నగరం" అని కూడా పిలుస్తారు.

అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర నుంచి..

టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ దాడికి సంబంధించి వివ‌రాలను వెల్లడించింది. 1950- 1960లలో భారత్-యూదు కమ్యూనిటీకి చెందిన ప్ర‌జ‌లు ఇజ్రాయెల్‌కు వలస వెళ్లారు. వీరిలో మహారాష్ట్రకు చెందినవారు అత్య‌ధికంగా ఉండ‌గా కేరళ, కోల్‌కతాకు చెందిన వారు సైతం ఉన్నారు. ఇటీవల మిజోరం, మణిపుర్‌కు చెందిన మరికొంతమంది భారత యూదులు కూడా డిమోనాకు వలస వెళ్లారు. ఈ నగరంలో దాదాపు 7,500 మంది భారత సంతతికి చెందిన‌ ప్రజలు ఉంటున్నారు. వీరు మరాఠీలో మాట్లాడతారు. అంతో ఇంతో హిందీ కూడా మాట్ల‌డగ‌లుగుతారు. వీరు నిర్వ‌హించే దుకాణాల్లో సోన్‌పాప్‌డి, గులాబ్ జామ్‌, పాప్రి చాట్, భేల్‌పురి వంటి భారతీయ ఆహార ప‌దార్థాలు ల‌భిస్తాయి.

ఓనం, దీపావ‌ళి పండ‌గ‌లు..

భారత‌ సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ ఓనం, దీపావళి వంటి పండగలను నిర్వహించుకుంటారు. 2025లో ఇక్కడ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నెల రోజుల పాటు థియేటర్లలో సంద‌డి నెల‌కొంది. డిమోనాతో పాటు హైఫా, టెల్ అవీవ్, అరద్, నెతన్యా, అఫులా వంటి నగరాల్లోనూ భారత సంతతి వారు ఉండ‌డం విశేషం.

Advertisement

తాజావార్తలు

Advertisement