త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indigo | ఇండిగో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఆర్టీసీ బ‌స్సులు

ఇండిగో (Indigo) విమానాల ర‌ద్దుతో ప్ర‌యాణీకులు ఇబ్బందులు ప‌డ‌కుండా ఆర్టీసీ (RTC) ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేసింది

A

News | Published On Dec 6, 2025, 3.16 pm IST

Indigo | ఇండిగో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఆర్టీసీ బ‌స్సులు
Advertisement

విమాన‌యాన రంగంలో నెల‌కొని ఉన్న సంక్షోభంతో వంద‌ల సంఖ్య‌లో ఇండిగో (Indigo) విమానాలు ర‌ద్ద‌వుతుండ‌డంతో వారి వెత‌ల‌ను కొంతైనా తీర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) న‌డుం బిగించింది. విమానాశ్ర‌య ప్ర‌యాణీకుల కోసం ఆర్టీసీ (RTC) ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. ప్ర‌యాణీకుల సౌక‌ర్యార్థం శంషాబాద్ (Shamshabad) లో ఆర్టీసీ స్లీప‌ర్ (RTC Sleeper) బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచుతోంది. చెన్నై (Chennai), బెంగుళూరు (Bengaluru) ల‌కు ఆ బ‌స్సులు బ‌య‌ల్దేర‌నున్నాయి. దాంతో పాటు రాజ‌మండ్రి, కాకినాడ‌, విశాఖ‌ప‌ట్నంల‌కు సైతం అద‌న‌పు బ‌స్సులు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement