త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC | జాతీయ వేదిక‌పై తెలంగాణ‌ ఆర్టీసీ ముద్ర వేశాం: వై. నాగిరెడ్డి

TGSRTC | దేశంలోనే మొద‌టిసారి కాలుష్య నివారణకు తెలంగాణలో విద్యుత్ (Electric) బస్సులను విజయవంతంగా నడుపుతున్నామ‌ని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి (Y Nagireddy) తెలిపారు. విద్యుత్ బస్సుల సమర్థవంతమైన నిర్వహణలో టీజీఎస్ ఆర్టీసీ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు.

S

Telangana | Published On May 17, 2026, 12.42 pm IST

TGSRTC | జాతీయ వేదిక‌పై తెలంగాణ‌ ఆర్టీసీ ముద్ర వేశాం: వై. నాగిరెడ్డి
Advertisement
  • దేశంలోనే ఆద‌ర్శంగా తెలంగాణ ఆర్టీసీ విద్యుత్‌ బ‌స్సులు
  • హైద‌రాబాద్‌ను పూర్తి కాలుష్య ర‌హిత నగ‌రంగా తీర్చిదిద్దేందుకు అడుగులు
  • యుద్ధం వేళ స్పేర్ పార్ట్స్ ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
  • మహాలక్ష్మి పథకంపై ఇతర రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ప్రశంసించారు
  • ​ఆర్టీసీ గ్యారేజీలు సంస్థ‌కు గుండెకాయ‌లాంటివి
  • డిజిట‌ల్ ప‌ద్ధ‌తుల్లో వాహ‌నాల ఫిట్‌నెస్‌, విడిభాగాల ప‌ర్య‌వేక్ష‌ణ‌
  • ముస్సోరి ASRTU’ అఖిల భారత సమావేశంలో తెలంగాణ‌ ఆర్టీసీ ఎండి వై. నాగిరెడ్డి వెల్ల‌డి

TGSRTC | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలోనే మొద‌టిసారి కాలుష్య నివారణకు తెలంగాణలో విద్యుత్ (Electric) బస్సులను విజయవంతంగా నడుపుతున్నామ‌ని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. విద్యుత్ బస్సుల సమర్థవంతమైన నిర్వహణలో టీజీఎస్ ఆర్టీసీ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. ఉత్తరాఖండ్ లోని ముస్సోరీ వేదికగా నిర్వ‌హించిన‌ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ASRTU) అఖిల భారత సమావేశంలో ఆయ‌న పాల్గొని అధ్య‌క్ష‌త వ‌హించి ప్ర‌సంగించారు. భవిష్యత్తులో మరిన్ని పర్యావరణ అనుకూల విద్యుత్ బస్సులను తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని పూర్తి కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ఆర్టీసీల ఛైర్మన్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (EDలు), ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొని రవాణా రంగ పురోగతిపై విస్తృతంగా చర్చించారు.

సంస్థకు గుండెకాయ లాంటి ఆర్టీసీ గ్యారేజీల నిర్వహణలో అధునాతన సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనాల ఫిట్‌నెస్, విడిభాగాల లభ్యత, మెయింటెనెన్స్ షెడ్యూళ్లను పూర్తి డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించడం ద్వారా బస్సుల సామర్థ్యం పెరగడమే కాకుండా, ప్రయాణీకులకు మరింత సురక్షితమైన, నమ్మకమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన వెల్లడించారు.

స్పేర్ పార్ట్స్ వెండ‌ర్స్‌తో కీల‌క భేటీ..

ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్టీసీ సంస్థలకు స్పేర్ పార్ట్స్ సరఫరా చేసే వెండర్స్ తో కీలక భేటీ జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా విపరీతంగా పెరుగుతున్న స్పేర్ పార్ట్స్ ధరలను ఎలా అధిగమించాలనే అంశంపై అసోసియేషన్ ఛైర్మన్ వై.నాగిరెడ్డి కీలక సూచనలు చేశారు. పెరుగుతున్న ధరల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు, ఆర్టీసీలపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ టాప్..

ప్రజా రవాణా రంగంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానం (IT) వినియోగంలో టీజీఎస్ ఆర్టీసీ అగ్రగామిగా నిలుస్తోందని ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా, అంతర్గత నిర్వహణను సైతం డిజిటలైజ్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా సంస్థకు గుండెకాయ లాంటి ఆర్టీసీ గ్యారేజీల నిర్వహణలో అధునాతన సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనాల ఫిట్‌నెస్, విడిభాగాల లభ్యత, మెయింటెనెన్స్ షెడ్యూళ్లను పూర్తి డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షిస్తున్న‌ట్లు చెప్పారు.

రూ.10 వేల కోట్ల ప్ర‌యాణాలు..

తెలంగాణలో మహిళల కోసం విజయవంతంగా అమలవుతున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి ఛైర్మన్ సదస్సులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా అనతికాలంలోనే రికార్డు స్థాయిలో 10 వేల కోట్ల ప్రయాణాలను పూర్తి చేసి, రవాణా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింద‌న్నారు. తెలంగాణ ఆర్టీసీని సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు అభినందించినట్లు తెలియ‌జేశారు.

​ఈ సమావేశంలో టీజీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED-O) సీహెచ్. వెంకన్నతో పాటు ఉత్తరాఖండ్, కర్ణాటక, ఒడిశా, ఇతర రాష్ట్రాల ఆర్టీసీ ఛైర్మన్లు, వివిధ రాష్ట్రాల రవాణా రంగ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement