Kalvakuntla Kavitha | ఏప్రిల్ 25న రాజకీయ పార్టీని ప్రకటిస్తా: కవిత
Political Party | వచ్చే నెల 25న రాజకీయ పార్టీ(Political Party)ని ప్రకటిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తెలిపారు. మేడ్చల్ (Medchel)లోని అద్వయ కన్వేషన్ లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు యువత, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.
త్రినేత్ర.న్యూస్: వచ్చే నెల 25న రాజకీయ పార్టీ(Political Party)ని ప్రకటిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తెలిపారు. ఉదయం 10 గంటలకు మంచి ముహుర్తం ఉందన్నారు. శ్రీరామనవమి రోజున ఈ ప్రకటన చేయడం సంతోషంగా ఉందన్నారు. మేడ్చల్ (Medchal)లోని అద్వయ కన్వేషన్ లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు యువత, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ మేరకు నిజామాబాద్‌లో శుక్రవారం మీడియాతో కవిత మాట్లాడారు.
రాష్ట్ర రాజకీయాలను మార్చే సత్తా యువత చేతుల్లోనే ఉందన్నారు. ఇన్నాళ్ల తెలంగాణలో ప్రభుత్వాలు యువతకు ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. తాము పెట్టబోయే పార్టీ యువత కోసం ఏం చేయబోతుందో పార్టీ ప్రకటన రోజునే వెల్లడిస్తామన్నారు. యువతకు, మహిళలకు తమ పార్టీలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. పురుషులు నడిపిన పార్టీలను చూశామని ఇక ఇప్పుడు మహిళలు రాజకీయాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.
ఇంటికొచ్చే లోన్ల కోసం, పంటకొచ్చే బోనస్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి పోవాలన్నారు. ఇలా ఇంకెన్నో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. మహిళల్లో మార్పు తీసుకురావడానికి ఒక ఆడబిడ్డగా ముందుకొస్తున్నానని.. తనకు అండగా నిలవాలని విజ్ఙప్తి చేశారు. ప్రతి పల్లె నుంచి మహిళలు, యువత, కార్యకర్తలు దండులా కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 25న ఉదయం 8 గంటల లోపే వేదిక ప్రాంగణంలోకి చేరుకోవాలని కవిత కోరారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






