MLC Pochampally Srinivas Reddy | మీ సమావేశాలకో దండం..నేను రానే రాను: ఎమ్మెల్సీ పోచంపల్లి
MLC Pochampally Srinivas Reddy | తన నియోజకవర్గ అభివృద్ధి ప్రతిపాదనలు ప్రభుత్వం పట్టించుకోలేదని.. అందుకే హైదరాబాద్ (Hyderabad) లో నేడు రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై నిర్వహిస్తున్న సమావేశాన్ని బాయ్‌కాట్ (Meeting boycott) చేయాలని నిర్ణయించుకున్నానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రతిపాదనలను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడం శాసన మండలి సభ్యుడిగా నా హక్కును హరించడమేనని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
MLC Pochampally Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్: తన నియోజకవర్గ అభివృద్ధి ప్రతిపాదనలు ప్రభుత్వం పట్టించుకోలేదని.. అందుకే హైదరాబాద్ (Hyderabad) లో నేడు రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై నిర్వహిస్తున్న సమావేశాన్ని బాయ్‌కాట్ (Meeting boycott) చేయాలని నిర్ణయించుకున్నానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రతిపాదనలను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడం శాసన మండలి సభ్యుడిగా నా హక్కును హరించడమేనని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం ఆయన బహిరంగ లేఖను విడుదల చేశారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి అందుబాటులో ఉన్న నిధుల మేరకు రూ.248.40 లక్షల అంచనా వ్యయంతో అభివృద్ధి ప్రతిపాదనలు పంపాను. రూ.124.20 లక్షల మేర పరిగణలోకి తీసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి హనుమకొండ జిల్లా కలెక్టర్‌కు సూచించారు. దీంతో పరిపాలనా అనుమతులు లభించాయి. కానీ మిగిలిన నిధులు కూడా మంజూరు చేయాలని కోరానని, ఇప్పటివరకు వాటిని పెండింగ్‌లో పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. దీంతో నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు సాధ్యం కావడం లేదన్నారు.
నిధులు విడుదల చేయకుండా సమావేశానికి రావాలని తనకు ఆహ్వానం పంపడం విచారకరమన్నారు. తన సిఫారసులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. ఇప్పటికైనా ప్రతిపాదనలకు అనుమతులిస్తారనే నమ్మకం లేదన్నారు. అందుకే ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




